Wednesday, October 22, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంప్రమోద్‌ మరణం.. పోలీస్‌శాఖకు తీరని లోటు

ప్రమోద్‌ మరణం.. పోలీస్‌శాఖకు తీరని లోటు

- Advertisement -

– కానిస్టేబుల్‌ కుటుంబానికి అండగా ఉంటాం ొ ప్రభుత్వం తరఫున రూ.కోటి ఎక్స్‌గ్రేషియా
– కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, 300 గజాల ఇంటిస్థలం : డీజీపీ బి.శివధర్‌రెడ్డి
– రియాజ్‌ ఎన్‌కౌంటర్‌ ఘటన పట్ల మానహహక్కుల కమిషన్‌ నోటీసులు
నవతెలంగాణ-నిజామాబాద్‌ ప్రాంతీయప్రతినిధి

అందరితో కలవిడిగా ఉంటూ విధులు నిర్వర్తించే సీసీఎస్‌ కానిస్టేబుల్‌ ప్రమోద్‌కుమార్‌ మృతి పోలీస్‌శాఖకు తీరని లోటని డీజీపీ బి.శివధర్‌రెడ్డి అన్నారు. నిందితుడి దాడిలో మృతిచెందిన ఆయన కుటుంబానికి ప్రభుత్వం, పోలీసు శాఖ అండగా నిలుస్తుందని భరోసా కల్పించారు. మల్టీజోన్‌ ఐజీ ఎస్‌.చంద్రశేఖర్‌రెడ్డి, కలెక్టర్‌ టి.వినరు కృష్ణారెడ్డి తదితరులతో కలిసి డీజీపీ మంగళవారం నిజామాబాద్‌లోని కానిస్టేబుల్‌ నివాసానికి వెళ్లి పరామర్శించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక ఆదేశాల మేరకు తాను ఇక్కడకు వచ్చానని వెల్లడించారు. కానిస్టేబుల్‌ ప్రమోద్‌కుమార్‌ హత్య దురదృష్టకరమని చెప్పారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ.కోటి ఎక్స్‌గ్రేషియాతోపాటు 300 గజాల ఇంటి స్థలం, పెన్షన్‌, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. వీటితో పాటు పిల్లల బాగోగులు చూసుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. తన ప్రాణానికి తెగించి కానిస్టేబుల్‌ హత్య నిందితుడైన రియాజ్‌ను పట్టించిన ఆసిఫ్‌ తెగువను ఈ సందర్భంగా డీజీపీ ప్రశంసించారు. ఈ క్రమంలో గాయపడిన ఆయనకు హైదరాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స చేయిచేస్తున్నట్టు తెలిపారు. రియాజ్‌ ఆచూకీ తెలిపిన వారికి ప్రకటించిన రూ.50 వేల రివార్డు చెక్కును ఆసిఫ్‌ భార్య సబీనా బేగమ్‌కు అందజేశారు.

మావోయిస్టులు బయటకు రండి
మావోయిస్టుల్లో తెలంగాణ నుంచి సుమారు 65 మంది ఉన్నారని.. వారిలో నాయకత్వ స్థాయిలో సైతం పలువురు ఉన్నట్టు డీజీపీ తెలిపారు. అడవిని విడిచి జనజీవన స్రవంతిలో కలవాలని, కేసుల విషయంలో సానుభూతితో ఉన్నామని, వేధింపులు ఏమీ ఉండబోవని భరోసా కల్పించారు. పోలీస్‌ ద్వారానైనా లేకుంటే మీడియా, రెవెన్యూ అధికారులు, రాజకీయ నాయకులు తదితర మార్గాల ద్వారా లొంగిపోవాలని సూచించారు. ప్రెస్‌మీట్‌లో సీపీ సాయిచైతన్య, ఏసీపీ తదితరులు పాల్గొన్నారు.

మానవ హక్కుల కమిషన్‌ నోటీసులు
రియాజ్‌ ఎన్‌కౌంటర్‌పై.. మీడియాలో వచ్చిన కథనాలను సుమోటాగా స్వీకరించి మానవ హక్కుల కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనకు దారి తీసిన పరిస్థితులపై ఏదైనా మెజిస్ట్రేట్‌ జ్యుడిషియల్‌చే విచారణ చే యించి నివేదిక అందజేయాలని డీజీపీని ఆదేశించింది. ఎఫ్‌ఐఆర్‌, పోస్టు మార్టం నివేదిక కాపీలను నవంబర్‌ 24వ తేదీలోపు అందజేయాలని సూచిం చింది. దీనిపై డీజీపీ స్పందించి మెజిస్ట్రేట్‌తో విచారణ చేయిస్తున్నట్టు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -