Wednesday, October 22, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంశివాలికి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులు

శివాలికి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులు

- Advertisement -

– మొత్తం 21 గిన్నిస్‌ రికార్డులు సాధించిన విద్యార్థిని
నవతెలంగాణ-పటాన్‌చెరు

హైదరాబాద్‌లోని గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థిని శివాలి జోహ్రి శ్రీవాస్తవ (స్కూల్‌ ఆఫ్‌ టెక్నాలజీ, 2016-2020 బ్యాచ్‌ సీఎస్‌ఈ) ఆమె తల్లిదండ్రులు కవితా జోహ్రి, శ్రీవాస్తవతో కలిసి ప్రపంచంలోనే అతిపెద్ద ఓరిగామి ప్రదర్శన (కాగితంతో కళాకృతులు) చేసింది. దాంతో రెండు సరికొత్త గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులను సాధించారు. ఈ తాజా విజయంతో శివాలి మొత్తం 21 గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులకు చేరుకుని, దేశంలో అత్యధిక సంఖ్యలో గిన్నిస్‌ రికార్డులు కలిగి ఉన్న వ్యక్తిగా ఆమె నిలిచారు. గతంలో శివాలి 19 గిన్నిస్‌ రికార్డులు సాధించారు. వాటిలో 1,251 చేతితో తయారు చేసిన కాగితపు బొమ్మలు, 7,011 క్విల్డ్‌ పువ్వులు, 2,111 పేపర్‌ క్విల్డ్‌ బొమ్మలు, 3,501 ఓరిగామి తిమింగలాలు, 2,100 పెంగ్విన్లు, 6,132 సిట్రస్‌ పండ్లు, 6,001 తిమింగలాలు, 2,500 పెంగ్విన్లు, 1,993 మాపుల్‌ ఆకులు, 6,500 గబ్బిలాలు, 5,500 కార్లు, 3,400 డైనోసార్లు, 1,900 కుక్కలు, 3,400 నెమళ్లు, 3,200 పందులు, 4,400 చొక్కాలు, 2,200 క్విల్డ్‌ బొమ్మలు, 3,200 సీల్స్‌, 3,400 రిబ్బన్‌ టైలు ఉన్నాయి. ఇవేగాక, 15 అసిస్ట్‌ వరల్డ్‌ రికార్డులు, నాలుగు యూనిక్‌ వరల్డ్‌ రికార్డులను కూడా శివాలి సాధించారు. గీతం యూనివర్సిటీ అదనపు ఉప కులపతి ప్రొఫెసర్‌ డీఎస్‌.రావు, రెసిడెంట్‌ డైరెక్టర్‌ డీవీవీఎస్‌ఆర్‌ వర్మ, ఆతిథ్య విభాగం-క్యాంపస్‌ లైఫ్‌ డైరెక్టర్‌ అంబికా ఫిలిప్‌, గణిత శాస్త్ర ఆచార్యులు డాక్టర్‌ డి.మల్లికార్జున్‌ రెడ్డి, పలువురు అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు శివాలి విజయాలను ప్రశంసించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -