నవతెలంగాణ – మద్నూర్
రబ్బి పంట సాగు కోసం రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై అందించే శనగ విత్తనాలను విత్తన శుద్ధి పంట మార్పిడితో సాగు చేసుకుంటే పంట దిగుబడులు అధికంగా వస్తాయని వ్యవసాయ శాఖ అధికారుల సూచనలను పాటించి సెనగ పంటను రైతులు సాగు చేసుకోవాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు రైతులకు సూచించారు. సబ్సిడీపై శనగ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బుధవారం నాడు మద్నూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. రైతులు పంట మార్పిడితో పంటలు సాగు చేసుకుంటే అధిక దిగుబడులు రావడమే కాకుండా పంట తెగుళ్ల నివారణ చేసుకోవచ్చని వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు రైతులు తప్పక పాటించాలని ఎమ్మెల్యే రైతులను కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతుందని తెలిపారు. ఈ సబ్సిడీ శనగ విత్తనాల పంపిణీ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రాజు,మండల తాసిల్దార్ ఎండి ముజీబ్. ఎమ్మెల్యేకు సన్నిహితుడుగా పిలవబడే సాయి పటేల్,మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుటుంబ సభ్యులు రమేష్,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేశ్ పటేల్, మద్నూర్ సింగిల్విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్, మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయిలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమాన్లు స్వామి, కొండ గంగాధర్, మద్నూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శివాజీ రాథోడ్, సంతోష్ మేస్త్రి దిగంబర్ వివిధ గ్రామాల నుండి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వ్యవసాయ రైతులు వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
విత్తన శుద్ధి, పంట మార్పిడి, చేసుకోండి: ఎమ్మెల్యే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES