Thursday, October 23, 2025
E-PAPER
Homeమానవిఅసంతృప్తి పోవాలంటే..?

అసంతృప్తి పోవాలంటే..?

- Advertisement -

ఉద్యోగం ఆర్థిక భరోసాను అందించడమే కాదు సమాజంలో మనకు ఒక హౌదానూ తెచ్చిపెడుతుంది. ఇలాంటి వృత్తి జీవితాన్ని ఎంతగా ఆస్వాదిస్తే కెరీర్‌లో అంతగా ఎదగగలుగుతాం. అయితే కొంతమంది మాత్రం తాము చేసే ఉద్యోగం విషయంలో అసంతృప్తికి లోనవుతుంటారు. కెరీర్‌ను భారంగా లాక్కొస్తుంటారు. నిజానికి దీనివల్ల కెరీర్‌లో ఉన్నతి సాధించకపోగా అప్పటి వరకు గడించిన ఉద్యోగానుభవం పైనా రిమార్క్‌ పడే అవకాశాలుంటాయి. అందుకే ఈ అసంతృప్తికి కారణమేంటో తెలుసుకొని వాటిని దూరం చేసుకోవాలి.

– ఉద్యోగంలో అసంతృప్తిని దూరం చేసుకోవాలంటే పని వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చుకోవడం ముఖ్యం. కనుక మీ మనసుకు ప్రశాంతతనిచ్చే మొక్కల్ని, వస్తువుల్ని ఏర్పాటు చేసుకోండి. పనికి తగినట్టుగా అనువైన ప్రణాళిక వేసుకోవడం, మిమ్మల్ని ప్రోత్సహించే సహౌద్యోగులతో చెలిమి చేయడం ఇవన్నీ దోహదం చేస్తాయి.
– కెరీర్‌లో ఎలాంటి లక్ష్యాలూ లేకుండా ముందుకు సాగడం వల్ల కూడా ఒక దశలో అసంతృప్తికి లోనవుతుంటారు. అందుకే ఉత్సాహంగా పని చేయాలంటే కెరీర్‌కి సంబంధించి నిర్దిష్ట లక్ష్యాలను ఏర్పరచుకోవడం ముఖ్యం.
– విరామం లేకుండా పని చేయడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. చేసే పనిపై ఆసక్తి తగ్గుతుంది. కాబట్టి మధ్యమధ్యలో విరామం తీసుకోవడం, చిన్న చిన్న డెస్క్‌ వర్కవుట్లు చేయడం వల్ల తిరిగి పునరుత్తేజితం కావచ్చు. అలాగే అప్పుడప్పుడూ పని నుంచి స్వల్ప విరామం తీసుకొని కుటుంబంతో కలిసి వెకేషన్లకూ ప్లాన్‌ చేసుకోవచ్చు. తిరిగొచ్చాక పనిపై పూర్తి దృష్టి పెట్టవచ్చు.
– ఉద్యోగ భద్రతకు సంబంధించిన భయాల్ని, అసంతృప్తుల్ని దూరం చేసుకోవాలంటే మారుతున్న సాంకేతికతల్ని బట్టి కొత్త నైపుణ్యాల్ని నేర్చుకోవడం అత్యుత్తమమైన మార్గం. ఇది కొత్త అవకాశాల్ని అందించడంతో పాటు కెరీర్‌ అభివృద్ధికీ దోహదం చేస్తుంది.
– ఇంటిని పనిని సమన్వయం చేసుకోవడం కష్టమే. ఇటు ఇంట్లో కొన్ని పనుల్లో కుటుంబ సభ్యుల సహాయం తీసుకోవడం, అటు ఆఫీస్‌లో కొలీగ్స్‌ మద్దతు కోరడం వల్ల ఇది సులవవుతుంది.
– ఎంత చేసినా ఫలితం శూన్యం అనుకునే బదులు, మీ పనితీరు, సంస్థ అభివృద్ధిలో మీరు పోషించిన పాత్ర గురించి పై అధికారులకు తెలియజేయండి. వాటికి సంబంధించి మీరు రూపొందించిన నివేదికల్ని వారికి చూపించండి. మీ కష్టాన్ని వారు తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటారు. తద్వారా మీ కెరీర్‌లో అసంతృప్తి దూరమవుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -