అనీష్ హీరోగా, స్వీయ దర్శకత్వంలో రానున్న ‘లవ్ ఓటీపీ’ చిత్రాన్ని విజయ్ ఎం రెడ్డి నిర్మించారు. పుష్ప మణిరెడ్డి సమర్పణలో భావప్రీత ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రూపొందుతున్న ఈ చిత్రంలో రాజీవ్ కనకాల ప్రధాన పాత్రలో నటించారు. జాన్విక, నాట్య రంగ వంటి వారు కీలక పాత్రల్ని పోషించారు. ఈ సినిమాను నవంబర్ 14న రిలీజ్ చేయబోతున్నారు. ఈ మేరకు బుధవారం చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. రాజీవ్ కనకాల మాట్లాడుతూ, ‘ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో చిత్రీకరించాం. ఇందులో నేను తండ్రి పాత్రను పోషించాను. కొడుకుని కూతురిలా చూసుకునే ఓ డిఫరెంట్ ఫాదర్ క్యారెక్టర్ నాది. థియేటర్లో అందరూ ఎంజాయ్ చేసేలా, పగలబడి నవ్వుకునేలా ఈ చిత్రం ఉంటుంది’ అని తెలిపారు. ‘ఇందులో మంచి కంటెంట్ ఉంటుంది.
మేం కంటెంట్‌ను నమ్మి ఈ మూవీని చేశాం. అందుకే పది రోజుల ముందే మీడియాకు మూవీని చూపించాలని అనుకున్నాం. విజయ్ సహకారాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను’ అని హీరో, దర్శకుడు అనీష్ చెప్పారు. నిర్మాత విజయ్ ఎం రెడ్డి మాట్లాడుతూ, ‘అనీష్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. ట్రైలర్ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. రాజీవ్ కనకాల మాకు ఎంతో సపోర్ట్ చేశారు’ అని తెలిపారు. ‘తెలుగులో ఇదే నాకు మొదటి చిత్రం. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మేకర్స్‌కి థ్యాంక్స్’ అని హీరోయిన్ జాన్విక చెప్పారు.
భిన్న ప్రేమకథా చిత్రం
- Advertisement -
- Advertisement -