– గవర్నర్ ఆమోదం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సమాచార హక్కు చట్టం కమిషనర్ల నియామక ఫైల్‌కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సోమవారం ఆమోదం తెలిపారు. నలుగురు సభ్యుల్ని నియమిస్తూ ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వారిలో ప్రస్తుతం చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (సీపీఆర్వో)గా పనిచేస్తున్న బోరెడ్డి అయోధ్యరెడ్డి, పీవీ శ్రీనివాసరావు, శ్రీమతి మొహసినా పర్వీన్, దీశాల భూపాల్ ఉన్నారు. వీరి నియామకంపై గవర్నర్‌కు కొన్ని అభ్యంతరాలు రావడంతో అప్పట్లో వెంటనే ఫైల్‌ను అప్రూవల్ చేయలేదు. అనంతరం ప్రభుత్వ అధికారులు గవర్నర్ అభ్యంతరాలను నివృత్తి చేయడంతో సోమవారం ఆమోదం తెలిపారు. ఆ వెంటనే ప్రభుత్వం జీఓ నెంబర్ 111 జారీ చేసింది. దీనితో కమిషనర్ల నియామకానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి.
ఆర్టీఐ కమిషనర్లకు లైన్ క్లియర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES