Thursday, October 23, 2025
E-PAPER
Homeసినిమానెక్ట్స్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ..

నెక్ట్స్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ..

- Advertisement -

తెలుగు సినిమా పతాక గత కొన్ని సంవత్సరాలుగా అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడుతున్నా, మన దేశంలో రూపొందిన ఏదైనా సినిమా అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కితే దానిని హాలీవుడ్‌ స్థాయిలో రూపొందిన చిత్రంగా అభివర్ణించడం ఇప్పటికీ సర్వసాధారణం. అంతేకాదు సినిమాలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత పురస్కారం ఆస్కార్‌ను అందించేది కూడా హాలివుడ్డే.
అందుకే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం ఆస్కార్‌ అందుకోవడాన్ని మన దేశం మొత్తం గర్వాతిశయంతో సెలబ్రేట్‌ చేసుకుంది. ఇంతటి ప్రతిష్టాత్మక ఆస్కార్‌ సంబరాల్లో (97వ అకాడమీ అవార్డ్స్‌లో) ఈ ఏడాది మన తెలుగు హీరో సందడి చేశాడు.

చాలా అరుదుగా మాత్రమే ఆరుదెంచే ఈ అద్భుత అవకాశాన్ని అందుకున్న ఆ తెలుగు హీరో రాజ్‌ దాసిరెడ్డి. మారుతి దర్శకత్వంలో ‘భద్రం బి కేర్‌ ఫుల్‌ బ్రదరు’ చిత్రంతో హీరోగా అరంగేట్రం చేసిన రాజ్‌ దాసిరెడ్డి ఆస్కార్‌ – 2025 వేడుకల్లో పాల్గొనేందుకు ఆహ్వానం అందుకొని, ‘హాలీవుడ్‌ వాక్‌ ఆఫ్‌ ఫేమ్‌’, ‘న్యూయార్క్‌ ఫ్యాషన్‌ వీక్‌ – 2025’లోనూ సందడి చేశాడు. యాక్షన్‌ ఎంటర్టైనర్‌గా తెరకెక్కనున్న తన తదుపరి చిత్రం కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -