– తాజా పరిస్థితులపై చర్చ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సోమవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో జరిగిన ఈ భేటీలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కూడా పాల్గొన్నారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో సీఎం… గవర్నర్‌తో సమావేశమైనట్టు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి గురించి ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గవర్నర్‌కు వివరించారు. సమాచార కమిషన్ చైర్మెన్‌గా చంద్రశేఖరరెడ్డిని నియమించిన దరిమిలా మిగతా సభ్యుల నియామకాలకు కూడా ఆమోదముద్ర వేయాలంటూ సీఎం, గవర్నర్‌ను కోరినట్టు తెలిసింది. దానికి ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ నేపథ్యంలోనే సోమవారం సాయంత్రం సంబంధిత జీవో విడుదల కావటం గమనార్హం.
గవర్నర్‌తో సీఎం రేవంత్ భేటీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES