Thursday, October 23, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఇద్దరు జర్నలిస్టులకు ఈయూ మానవహక్కుల అవార్డు

ఇద్దరు జర్నలిస్టులకు ఈయూ మానవహక్కుల అవార్డు

- Advertisement -

బ్రస్సెల్స్‌ : ఇద్దరు జర్నలిస్టులకు యూరోపియన్‌ యూనియన్‌ ఉన్నత మానవ హక్కుల అవార్డు లభించింది. యూరోపియన్‌ పార్లమెంట్‌ అధ్యక్షురాలు రాబర్టా మెట్సొలా బుధవారం ఈ విషయాన్ని ప్రకటించారు. కాగా, ఆ ఇద్దరు జర్నలిస్టుల్లో ఒకరు బెలారస్‌లో మరొకరు జార్జియాలో జైలు శిక్షను అనుభవిస్తున్నారు. వీరిద్దరిలో ఒకరు పోలిష్‌ వార్తాపత్రిక గెజిటా వైబొర్కాజకు విలేకరిగా పనిచేస్తున్న ఆండ్రెజ్‌ పాక్సోబట్‌ కాగా మరొకరు జార్జియాలో స్వతంత్ర మీడియా సంస్థలు రెండింటిని స్థాపించిన ప్రముఖ జర్నలిస్టు ఎంజియా అమగ్లొబెలి.

వీరిలో ఆండ్రెజ్‌ను బెలారస్‌ జాతీయ భద్రతకు ముప్పు కలిగిస్తున్నారన్న కారణంతో అరెస్టు చేశారు. 8ఏళ్లు జైలు శిక్ష విధించారు. ఇక ఎంజియా ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొన్నపుడు పోలీసు అధికారిపై చేయి చేసుకున్నారనే కారణంతో ఆమెకు రెండేండ్లు జైలుశిక్ష విధించారు. అన్యాయానికి వ్యతిరేకంగా గళమెత్తినందుకు, తమ పని తాము చేసుకుంటున్నందుకే ఆ ఇద్దరు జర్నలిస్టులను శిక్షించారని ఈయూ అధ్యక్షురాలు పార్లమెంట్‌కు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -