విద్యార్థులు లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం
రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఘటన
నవతెలంగాణ-రాజేంద్రనగర్
రోడ్డుపై వెళ్తున్న బస్సులో అకస్మాత్తుగా మంటలు వ్యాపించి బస్సు మొత్తం పూర్తిగా దగ్థమైన ఘటన బుధవారం రంగారెడ్డి మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నాదర్‌గుల్‌కు చెందిన ఒక ప్రయివేట్ స్కూల్ బస్సు బుధవారం మధ్యాహ్నం విద్యార్ధులు ఇండ్ల వద్ద దించి ఆరంగర్ నుంచి నాదర్‌గుల్ వైపు వెళ్తుంది. లక్ష్మిగూడ ప్రధాన రహదారిపైకి రాగానే బస్సులోని ఇంజన్‌లోనుంచి ఒక్కసారిగా మంటలు వచ్చాయి. గమనించిన బస్సు డ్రైవర్ హరి ప్రసాద్ రోడ్డుపై బస్సును ఆపి వెంటనే కిందికి దిగిపోయాడు. క్షణాల్లో మంటలు పూర్తిగా బస్సు మొత్తం వ్యాపించాయి.
ఆ సమయంలో విద్యార్థులు ఎవరూ బస్సులో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న చంద్రాయన్‌గుట్ట ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో బస్సు పూర్తిగా ఖాళీపోయింది. బస్సు ఇంజన్‌లో నుంచి మంటలు రావడం వల్లే ఈ ఘటన జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అగ్నికి ఆహుతైన స్కూల్ బస్సు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES