Wednesday, May 14, 2025
Homeరాష్ట్రీయంఎంపీ ఈటల ఇంటి ముట్టడికియూత్‌ కాంగ్రెస్‌ యత్నం

ఎంపీ ఈటల ఇంటి ముట్టడికియూత్‌ కాంగ్రెస్‌ యత్నం

- Advertisement -

– అరెస్టు చేసిన పోలీసులు
నవతెలంగాణ – మేడ్చల్‌

యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు సోమవారం మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌ ఇంటి ముట్టడికి యత్నించారు. అయితే వారిని పోలీసులు అరెస్టు చేసి దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వివరాల్లోకెళ్తే.. సీఎం రేవంత్‌రెడ్డిపై ఎంపీ ఈటల రాజేందర్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆయన ఇంటి ముట్టడికి యూత్‌ కాంగ్రెస్‌ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా మేడ్చల్‌ మున్సిపాలిటీ పరిధిలోని పూడూరు గ్రామంలో ఉన్న ఎంపీ ఈటల రాజేందర్‌ నివాసం వద్ద సోమవారం ఉదయం నుంచే భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కండ్లకోయ, శామీర్‌పేట్‌ రెండు వైపుల నుంచి ఈటల రాజేందర్‌ ఇంటికొచ్చే దారిలో కిలోమీటర్‌ దూరంలోనే పోలీసులు బారీకేడ్లను పెట్టారు. మరోవైపు ఇంటి వరకు యువజన కాంగ్రెస్‌ నేతలు వస్తే తిప్పికొట్టడానికి బీజేపీ నేతలు పెద్దఎత్తున ఈటల ఇంటికి చేరుకున్నారు. యువజన కాంగ్రెస్‌ నాయకులు ఈటల ఇంటి వైపు వచ్చి కిలోమీటర్‌ దూరంలో ఏర్పాటు చేసిన బారీకేడ్ల వద్దనే ఎంపీ దిష్టిబొమ్మ దహనం చేశారు. పోలీసులు వారిని అడ్డుకొని అరెస్టు చేసి డీసీఎంలో దుండిగల్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్‌ నాయకులు ఎంపీ ఈటలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏసీపీ శంకర్‌ రెడ్డి, సీఐ సత్యనారాయణ, ఎస్‌వోటి సీఐ శ్యాంసుందర్‌, దుండిగల్‌, సూరారం, మేడ్చల్‌ పోలీస్‌ స్టేషన్ల ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు, అదనపు బలగాలు బందోబస్తు నిర్వహించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -