Thursday, October 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సంతోష్ మేస్త్రీ ఇంట్లో దీపావళి వేడుకలు.. హాజరైన ఎమ్మెల్యే

సంతోష్ మేస్త్రీ ఇంట్లో దీపావళి వేడుకలు.. హాజరైన ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
కాంగ్రెస్ పార్టీలో మంచి నాయకునిగా సంతోష్ మేస్త్రి గుర్తింపు పొందుతున్నారు. బుధవారం రాత్రి సంతోష్ మేస్త్రి ఇంట్లో జరిగిన దీపావళి పాడ్యమి పూజలకు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ప్రత్యేకంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోటాకు సంతోష్ మేస్త్రి దంపతులు ఘన స్వాగతం పలుకుతూ.. శాలువాతో బొకే ను అందజేస్తూ ఘనంగా సన్మానించారు. సంతోష్ మేస్త్రి ఇంట్లో నిర్వహించిన పాడ్యమి పూజల్లో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీపావళి పండుగ పాడ్యమి పూజలను పురస్కరించుకొని సంతోష్ మేస్త్రి వందలాది మందికి భోజన ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ మద్నూర్, డోంగ్లి, మండలాల ముఖ్య నాయకులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాడ్యమి పూజలకు పిలవగానే హాజరైన ఎమ్మెల్యేకు సంతోష్ మేస్త్రీ కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. నాయకులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సంతోష్ మేస్త్రి ఇంటి వద్ద ఎమ్మెల్యే చిన్నారులతో టపాకాయలు కాలుస్తూ దీపావళి ఉత్సవాలు పాల్గొని అందరిని ఆనందపరిచారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -