త్రినాధ్ కఠారి హీరోగా ఆయన స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘ఇట్లు మీ ఎదవ’. వెయేళ్ళు ధర్మంగా వర్ధిల్లు అనేది ట్యాగ్ లైన్. సంజీవని ప్రొడక్షన్స్ బ్యానర్ పై బళ్లారి శంకర్ నిర్మిస్తున్నారు. తెలుగు అమ్మాయి సాహితీ అవాంచ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘ఉన్నట్టా మరి లేనట్టా..’ అంటూ సాగే పాటను హీరో శ్రీకాంత్ రిలీజ్ చేశారు. సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ ఈ సాంగ్‌ని అద్భుతమైన మెలోడీగా కంపోజ్ చేశారు. పూర్ణాచారి ఆకట్టుకునే లిరిక్స్ రాశారు. ఎస్‌పి చరణ్, శతిక సముద్రాల వోకల్స్ మెస్మరైజ్ చేశాయి. సాంగ్‌కి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ,”ఇట్లు మీ ఎదవ’ టైటిల్ చాలా కొత్తగా ఉంది. ‘ఉన్నట్టా మరి లేనట్టా’.. సాంగ్ చాలా అద్భుతంగా ఉంది. ఆర్పీ పట్నాయక్ అత్యద్భుతంగా కంపోజ్ చేశారు.
త్రినాధ్, సాహితీ జోడీ చాలా బావుంది. ప్రొడ్యూసర్ శంకర్, డిఓపి జగదీష్ నాకు మంచి మిత్రులు. ఓ సరికొత్త కథతో మంచి తారాగణంతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తప్ప కుండా విజయవంతం కావాలని కోరుకుంటున్నాను’ అని చెప్పారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. త్రినాధ్ కఠారి, సాహితీ అవాంచ, తనికెళ్ల భరణి, గోపరాజు రమణ, దేవీ ప్రసాద్, నవీన్ నేని, సురభి ప్రభావతి, మధుమణి, తాగుబోతు రమేష్, చలాకీ చంటి, జబర్దస్త్ నూకరాజు, జెమినీ సురేష్, డీడీ శ్రీనివాస్, రామజగన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: త్రినాధ్ కఠారి, ఎడిటర్: ఉద్ధవ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మల్లికార్జున్, లైన్ ప్రొడ్యూసర్: బృంధావన్ కేతిరెడ్డి.
‘ఉన్నట్టా మరి లేనట్టా..?’
- Advertisement -
- Advertisement -



