సిద్ధు జొన్నలగడ్డ నటించిన తాజా సినిమా ‘తెలుసు కదా’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్‌తో హౌస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. ఈ సందర్భంగా మేకర్స్ అప్రిషియేషన్ మీట్ నిర్వహించారు. హీరో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ, ‘ఈ సినిమా నన్ను ప్రశాంతంగా పడుకునేలా చేసింది. దీనికి డైరెక్టర్ నీరజ కోనకి, నితిన్‌కి థ్యాంక్స్ చెప్పాలి. ఈ కథకు నేనైతేనే కరెక్ట్‌గా ఉంటుందని నాకు కనెక్ట్ చేశారు. మా విజన్‌ని సపోర్ట్ చేసిన నిర్మాత విశ్వకి థ్యాంక్స్. ఆయన డబ్బు గురించి ఆలోచించలేదు. ఒక మంచి సినిమా తీద్దామని ముందుకు వచ్చారు. తమన్ ఫెంటాస్టిక్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ ఆల్బమ్ నా కెరీర్లో ఎప్పటికీ మిగిలిపోతుంది. ఇది పక్కా మాస్ సినిమా. థియేటర్స్‌కి వెళ్లి చూడండి.
ఈ సినిమా మీకు నచ్చుతుంది. మీకు గుర్తుండిపోతుంది. కొన్ని సంవత్సరాలు పాటు మీతో ఉండిపోతుంది’ అని తెలిపారు. ‘ఈ సినిమాకి మంచి విజయాన్ని అందించిన ఆడియన్స్‌కి కృతజ్ఞతలు. ఈ సినిమాకి చాలా మంచి రివ్యూస్ వచ్చాయి. ఇలాంటి యూనిక్ పాయింట్ మీద కొత్త డైరెక్టర్‌కి సిద్దు అవకాశం ఇవ్వడం అనేది గొప్ప విషయం. మేము ఒక యూనిక్ స్టోరీని చెప్పాము. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది’ అని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ చెప్పారు. నిర్మాత బండ్ల గణేష్, ప్రొడ్యూసర్, రైటర్ కోన వెంకట్, నిర్మాత ఎస్కేఎన్, డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి, డైరెక్టర్ సందీప్ రాజ్, డైరెక్టర్ నీరజకోన, వైవా హర్ష, రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్ తదితరులు ఈ వేడుకలో పాల్గొని చిత్ర విజయం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.
గుర్తుండిపోయే యూనిక్ స్టోరీ
- Advertisement -
- Advertisement -



