- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఈరోజు ఉదయం జరిగిన చిన్ని టేకూరు బస్సు ప్రమాదంలో 20 మంది ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటనపై తన ప్రగాఢ విచారం వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు తన సంతాపాన్ని తెలియజేసారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఈ దారుణ ఘటన మన రహదారులపై భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని, ఇటువంటి విషాద సంఘటనలు పునరావృతం కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని తెలియచేస్తుందని వారు అభిప్రాయపడ్డారు.
- Advertisement -



