- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
ఇంటి పరిసరాలలో నీరు నిల్వ ఉండకుండ జాగ్రత్తలు తీసుకోవాలని మెడికల్ అధికారి దివ్య తెలిపారు. శుక్రవారం ఫ్రైడే డ్రై డే సందర్భంగా మండలంలోని ఆయా గ్రామాలలో ఇంటి పరిసరాలను పరిశీలించి నిల్వ ఉన్న పాత్రల నుండి నీటిని తొలగించారు. మలేరియా, డెంగ్యూ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఓ వెంకటరమణ, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, తదితరులు ఉన్నారు.
- Advertisement -



