Sunday, October 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అధ్యక్షుని నియమించెనా.? 

అధ్యక్షుని నియమించెనా.? 

- Advertisement -

అధ్యక్షుడు ఎవరు…? 
నవతెలంగాణ – మునిపల్లి

మునిపల్లి మండల బిఆర్ఎస్ అధ్యక్షుడు లేక రెండు సంవత్సరాలు గడిచిన పార్టీ అధిష్టానం అధ్యక్షుని నియమించే విషయంలో విఫలమవుతుందని పలువురు పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. గత రెండు సంవత్సరాలక్రితం బిఆర్ఎస్ అధ్యక్షుడుగా కొనసాగిన వ్యక్తి గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమిటో పార్టీవిడి కాంగ్రెస్ లోకి వెళ్ళాడు, అప్పటినుండి మండల బిఆర్ఎస్ పార్టీలో నూతన అధ్యక్షున్ని ఎన్నుకునే విషయంలో పార్టీ విఫలమవుతుందని చెప్పవచ్చు. లోకల్ బాడీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధ్యక్షుడిని నియమించకపోవడంలో పార్టీ ఆంతర్యమేందో అర్థం కావట్లేదని పలువురు కార్యకర్తలు అంటున్నారు. ఏ కార్యకర్తను అడిగిన పార్టీ కోసం పని చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామని, పార్టీ అధిష్టానం అధ్యక్షుని నియమిస్తే ఇంకా బలంగా పనిచేస్తామని అంటున్నట్లు సమాచారం. అధ్యక్ష పదవి కోసం పలువురు సీనియర్ నాయకులు ఎదురుచూస్తున్నట్టు సమాచారం. పార్టీ అధిష్టానం ఇప్పటికైనా మునిపల్లి బిఆర్ఎస్ అధ్యక్షుని ఎన్నుకొని పార్టీని బలోపేతంలోకి నడిపించాలని పలువురు కార్యకర్తలు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -