Sunday, October 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని పరామర్శించిన సుదర్శన్ రెడ్డి

కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని పరామర్శించిన సుదర్శన్ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
ఇటీవల వీధి నిర్వహణలో వీర మరణం పొందిన సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని శనివారం బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ.. ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని తెలిపారు.ఆ కుటుంబానికి రావాల్సిన ఉద్యోగ విషయమై కలెక్టర్, సి పి తో మాట్లాడినారు. అనంతరం ఆ కుటుంబానికి మెరుగైన వైద్యం అందేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రి నందు సూపరిడెంట్ తో మాట్లాడటం జరిగింది. వీధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దాడులు చేస్తూ పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. ఆయనతో పాటు నూడ చైర్మన్ కేశ వేణు,నాగేష్ రెడ్డి,నరాల రత్నాకర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -