ఓబీసీ సెల్ అధ్యక్షులు బంక చిరంజీవి యాదవ్
నవతెలంగాణ – చిన్నకోడూరు
అబద్ధాలు ఆడడం హరీష్ రావుకు వెన్నతో పెట్టిన విద్యని చిన్నకోడూరు మండల ఓబీసీ సెల్ అధ్యక్షుడు బంక చిరంజీవి యాదవ్ విమర్శించారు. శనివారం మండల కేంద్రమైన చిన్న కోడూరులో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ .. రేషన్ కార్డుల విషయంలో హరీష్ రావు తప్పుడు ప్రచారం చేస్తు అబద్ధాలు ఆడడం మానుకోవాలని మండిపడ్డారు.
గత పది సంవత్సరాలుగా బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని రేషన్ కార్డులు పేదలకు పంపిణీ చేశారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండు సంవత్సరాల వ్యవధిలో ఏడు లక్షల పైచిలుకు రేషన్ కార్డులు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు.
ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా ఓబీసీ సెల్ ప్రధాన కార్యదర్శి జంగిటి బాలరాజు, కార్యదర్శి దిలీప్,చిన్న కోడూరు మండల సేవాదళ్ అధ్యక్షులు గుంజ రాజేందర్, సిద్దిపేట జిల్లా బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి కూన శ్రీనివాస్ చిన్నకోడూరు మండల్ కిసాన్ సెల్ ప్రధాన కార్యదర్శి ఎర్వ సత్యనారాయణ సికింద్లపూర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కూన సంతోష్ కుమార్ పాల్గొన్నారు.



