నవతెలంగాణ – హైదరాబాద్: హారిక కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ కళాశాల ఆధ్వర్యంలో శనివారం ఫ్రెషర్స్ డే వేడుకలను గుంటూరులోని స్టార్ కన్వెన్షన్ హాల్ లో అత్యంత ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఫిజియోథెరపిస్ట్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నేటి విద్యార్థులు రేపటి భారతదేశ అభివృద్ధికి పునాదులు అని అన్నారు. ఫస్ట్ ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్ వరకు హారిక ఫిజియోథెరపీ కాలేజీ విద్యార్థులకు మంచి నాలెడ్జ్ ఉందని అన్నారు. ఉపాధ్యాయులు మంచిగా బోధించి వారిని విద్యతోపాటు సామాజిక కోణాలలో కూడా తీర్చిదిద్దినారు.
హారిక ఫిజియోథెరపీ కాలేజీకి సంబంధించి ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు పుస్తకాలలో చదువుకునే విద్యతోపాటు చాలా బాగా ప్రాక్టికల్స్ నేర్పించి వారిని మంచి ప్రయోజకులుగా తీర్చిదిద్దుతున్నారు. ఇక్కడ బోధన చెప్పే ప్రతి ఉపాధ్యాయుడు ఫిజియోథెరపీ మీద మంచిపట్టు, అవగాహన కలిగి ఉన్నారు. ఇక్కడ చదివిన విద్యార్థులు గుంటూరు జిల్లాతో పాటు రాష్ట్రంలో, మనదేశంలో, విదేశాలలో చాలా ప్రతిభ కనబరుస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ డాక్టర్. షేక్ సుభాని, వైస్ ప్రిన్సిపాల్ హరి ముఖ్య ఉపాధ్యాయులు అతిథులుగా రేగుంట సునీల్ కవ్వంపల్లి రవి పోషయ్య పాల్గొన్నారు.
విద్యార్థులే దేశాభివృద్ధికి పునాదులు: డా.పెరుమాండ్ల రామకృష్ణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



