Sunday, October 26, 2025
E-PAPER
Homeకరీంనగర్దివ్యాంగుల పెట్రోల్ బంక్ భేష్..

దివ్యాంగుల పెట్రోల్ బంక్ భేష్..

- Advertisement -

ఉపాధి కల్పించడం అభినందనీయం..
ఇంచార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల

జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో దివ్యాంగులకు ఉపాధి కల్పించేందుకు పెట్రోల్ బంకు ఏర్పాటు చేయడం అభినందనీయమని ఇంచార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ కొనియాడారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఇన్చార్జి కలెక్టర్ ను పలువురు దివ్యాంగులు శనివారం కలిసి పుష్పగుచ్చం అందజేశారు. తమకు జిల్లా అధికార యంత్రం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పెట్రోల్ బంకులో ఉపాధి లభిస్తుందని ఇంచార్జి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. పెట్రోల్ బంక్ ఎక్కడ ఉందని? ఎంత మందికి ఉపాధి లభిస్తుందని ఇంచార్జి కలెక్టర్ ఆరా తీశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -