నవతెలంగాణ – భీంగల్: ఉత్తర తెలంగాణలో ప్రఖ్యాతి గాంచిన భీంగల్ పరిధిలోని లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం నుండి ప్రారంభం కానున్నాయి. గోదావరి నదికి దక్షిణ దిశగా రెండు యోజనాల దూరంలో ఉన్న శ్రీ లక్ష్మీనారసింహుడి దివ్యక్షేత్రం నింబాచలంగా విలసిల్లుతున్నది. దట్టమైన వేప చెట్లతో నిండి ఉండడంతో ఈ గుట్టకు నింబాచలంగా పేరు వచ్చినట్లు చరిత్ర. నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల పరిధిలోని ఈ పుణ్యక్షేత్రం కాలక్రమేణా లింబాద్రిగుట్టగా ప్రసిద్ధి చెందింది. గుట్టపై కొలువైన లింబద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతుంటాయి. భక్తుల కొంగుబంగారంగా అలరారుతున్న స్వామివారి బ్రహోత్సవాలు ఈ నెల26 (ఆదివారం) ప్రారంభించారు. ఏటా కార్తీక మాసంలో నిర్వహించే ఈ వేడుకల కోసం ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. స్వామి వారి నిత్య కైంకర్యాలతోపాటు బ్రహ్మోత్సవాలను నంబి వంశస్థులు నిర్వహించడం ఆనవాయితీ. ఆలయ ధర్మకర్తగా నంబి లింబాద్రి వ్యవహరిస్తున్నారు. జాతర వేలాది మంది భక్తజన సందోహం మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి రోజున జరిగే ఈ జాతర కోసం ఎప్పటిలాగే భక్తులు జిల్లా నలుమూలల నుంచే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. భక్తుల కోసం టీజీ ఆర్టీసీ నిజామాబాద్, ఆర్మూర్, కామారెడ్డి డిపో నుంచి ప్రత్యేకంగా జాతరకు ప్రత్యేకంగా బస్సులు వేస్తారు.
తెల్లవారుజాము నుంచే స్వామి వారిని దర్శించుకోడానికి భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి క్యూలైన్లలో బారులుతీరుతారు. గర్భాలయంలో సువర్ణాలంకార భూషితుడైన స్వామి వారిని దర్శించుకుని భక్తులు మొక్కులు మొక్కుకుంటారు. కోరిన కోరికలు తీరిన భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటారు. క్యూలైన్లలో స్వామి వారి దర్శనం కోసం గంటల కొద్దీ సమయం పట్టినా ఓపిగ్గా క్యూలైన్లలో నిల్చుని స్వామివారిని దర్శించుకుంటారు. క్యూలైన్లలో భక్తులకు దాహం వేస్తే తాగునీరు ఇబ్బందులు లేకుండా క్యూలైన్లో మంచి నీరు సదుపాయం చేసారు.
శ్రీవారి రోజువారీ కార్యక్రమాలు
26న అమ్మవారికి సారి సమర్పించారు
27న కొండపైకి ఉత్సవ మూర్తుల పయనం
28న దీపారాధన, రక్షాబంధనం, విష్ణు పంచకం, అంకురార్పన, మృత్యుసంగ్రహణం, అంకురార్పనం, గరుడ పటాధివాసం, ధ్వజారోహణం, శ్రవణ ప్రయుక్త క్షీరాభిషేకం
29న నృసంహ ఏకాక్షరి హవనం
30న సాయంత్రం శ్రీవారి ఎదుర్కోలు
31న మధ్యాహ్నం 12:30 గంటలకు స్వామివారి కల్యాణ మహోత్సవం
1న సర్వేషాం ఏకాదశి, చాతుర్మాస్య వ్రత సమాప్తి, నృసింహ ఏకాక్షర హవనం, గీతా హవనం, గరుడ సేవ
న గరుడ సేన
3న ఉత్థాన ద్వాదశి, తులసి వివాహం, కొండ ప్రదక్షిణ
4న వైకుంఠ చరుర్థి, ధాత్రిమూలే నృసింహ పూజ, ధాత్రి హవనం, డోలారోహనణం
5న చతుర్ధశి ఉపరి పూర్ణిమ, జాతర, రథోత్సవం
6న శేషహోమం, స్నపన తిరుమంజనం, భాగవత ఫలశృతి, పూర్ణాహుతి, పుష్పయాగం
7న దేవతోద్వాసనం, ధ్వజారోహణం, ఉద్వాసన బలిప్రదానం, కొండబలి, డోలోత్సవం, గ్రామాలయానికి ఉత్సవ మూర్తుల పయనం.
సోమవారం రోజున గ్రామాలయం నుంచి స్వామివారి ఉత్సవమూర్తులు కొండపైకి మేళ తాళాలతో ఊరేగింపుగా వెళ్లడంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త నంబి లింబాద్రి తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర ల నుంచి భక్తులు తరలి వస్తారు. బ్రహ్మోత్సవంలో ముఖ్య ఘట్టమైన కార్యం రథోత్సవం(జాతర), కళ్యాణం రోజున లక్షలాదిమంది జనంతో లింగాచలం కిటకిటలాడుతుంది.
భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
భక్తుల వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేశారు. అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ఏర్పాటు చేయనున్నారు. వృద్ధులు, వికలాంగుల రాకపోకాలకు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేశారు. భక్తులకు తాత్కాలిక మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేశారు. భక్తుల భద్రత కోసం పోలీస్ బందోబస్తు ఉంటుంది.



