నవతెలంగాణ – మోపాల్
మోపాల్ మండలంలోని బైరపూర్ గ్రామంలో ఆదివారం రోజున ఎమ్మెల్సీ కవిత పర్యటించారు. మొదటగా తండావాసులతో కలిసి నృత్యం చేయడం జరిగింది. అలాగే కొన్ని రోజుల క్రితం ప్రకాష్ అను రైతు పోడు భూమిలో పంటను పండించడం జరిగింది. దాన్ని ఫారెస్ట్ అధికారులు పోడు భూముల్లో పంట పండించినందుకు రసాయన మందుల ద్వారా పంటను చెరిపేయడం జరిగింది. పంటకు కోతకు వచ్చిన దశలో చెరిపేసినందుకు తాము తెచ్చిన పెట్టుబడికి కట్టే స్తోమత లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే స్థానికులు కల్పించి ఆసుపత్రిలో చేర్పించినందున త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుల గా ఉన్న సమయంలో మోపాల్ మండల పర్యటించినప్పుడు కచ్చితంగా ఈ ప్రాజెక్టు పాత డిజైన్ ప్రకారం కడతామని అలాగే ప్రాజెక్టు పరిధిలో ఉన్న భూములకు ఎటువంటి ఆటంకం లేదని 9 తాండాలకు మూడు గ్రామ పంచాయతీలకు ఆయన మాట ఇవ్వడం జరిగింది.
కానీ ప్రస్తుత అధికారంలోకి వచ్చిన వెంటనే దాని గురించి పట్టించుకోకుండా ఇక్కడున్న తండావాసులకు వ్యవసాయం చేసుకోకుండా ఫారెస్ట్ అధికారులతో ఇబ్బంది పెడుతున్నారని ఇది కరెక్ట్ పద్ధతి కాదని ఇప్పటికైనా కలెక్టర్ గారు దీనిపైన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు ఒకవేళ బాధితులకు న్యాయం జరగకపోతే తాను ఎటువంటి పోరాటానికైనా సిద్ధమని ఆమె తెలిపారు అలాగే ఆర్ ఓ ఎఫ్ ఆర్ ప్రకారం సాగు చేస్తున్న తండావాసులకు పట్టాలు కూడా కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. పంట చేతికి వచ్చిన సమయంలో పంటను నాశనం చేయడం కరెక్ట్ కాదని దీనికి ప్రకాష్ అనే రైతుకు కచ్చితంగా నష్టపరిహారం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.
ఫారెస్ట్ అధికారులు కూడా అతి ఉత్సాహం ప్రదర్శించవద్దని మానవత్వంతో కూడా చూడాలని ఆమె కోరారు. అలాగే ఇక్కడ కొందరి రైతుల పైన ఫారెస్ట్ అధికారుల కేసులు పెట్టారని మాజీ జెడ్పిటిసి నరేష్ కవిత దృష్టికి తీసుకురావడం జరిగింది దీని కాంగ్రెస్ స్పందిస్తూ కచ్చితంగా మీరు తరఫున మన పోరాడుతామని వారికి న్యాయం జరిగే విధంగా చూద్దామని బాధితులకు భరోసా ఇచ్చారు. తనపై అక్రమ కేసులు పెట్టారని జలంధర్ అనే రైతు కవితకు తనకు సంబంధించిన బాధను వ్యక్తపరచాడు. దీనికి కచ్చితంగా నీకు అండగా ఉంటానని జలంధర్ అనే రైతుకు ఆమె భరోసా ఇచ్చారు. ఆత్మహత్యల చేసుకోవడం కరెక్ట్ కాదని ఏదైనా ధైర్యంగా ఉండి పోరాడాలని మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఆమె తెలిపారు. నేను తెలంగాణ జాగృతి ఎప్పుడు ప్రజల ప్రక్షాన్ని నిలుస్తామని తెలిపారు.
అంతేకాకుండా అక్కడ బీసీ 42 శాతం రిజర్వేషన్ గురించి ఆమె మాట్లాడుతూ కచ్చితంగా రాష్ట్రంలో ఉన్న బిజెపి ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి బీసీ బిల్లుకు ఆమోదం ముద్ర వేస్తుందని ఆమె తెలిపారు. వారే బీసీ బిల్లు నీ ఆమోదించకుండా వారే ధర్నా చేయడం ఎంతవరకు సమంజసం కాదు అని బిసి నాకు కచ్చితంగా 42 శాతం రజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి నరేష్, జలంధర్, మరియు తండావాసులు కవిత అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
ప్రకాష్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



