– కుల సమారాధనకు సిద్దం కావాలి
నవతెలంగాణ – అశ్వారావుపేట
మున్నూరు కాపులు బలోపేతం మై ఐక్యతతో ఆర్థిక శక్తిగా ఎదగాలని ఆ సంఘం మండల అధ్యక్షుడు కురిశెట్టి నాగబాబు నాయుడు అన్నారు. ఆదివారం పట్టణంలోని జంగారెడ్డిగూడెం రోడ్డులో గల ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో మున్నూరు కాపు సంఘం మండల కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల ప్రక్రియ చట్టబద్ధత కల్పించేందుకు కృషి చేయాలన్నారు. అదేవిధంగా నవంబర్ 9 వ తారీకు మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో చేపట్టే కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సంఘ సభ్యులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కో – ఆర్డినేటర్ సూర్య ప్రకాష్ రావు, గౌరవ అధ్యక్షులు చిన్నంశెట్టి సత్యనారాయణ,పాశం రామారావు,కట్ట శ్రీనివాసరావు,ఉపాధ్యక్షులు పసుపులేటి రామస్వామి నాయుడు, పెద్ద కాపు, బండారు శ్రీనివాసరావు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తిరుమల శెట్టి అప్పారావు,తాడేపల్లి రవి,మట్లకుంట కామేష్, దండాబత్తుల నరేష్, నిర్మల పుల్లారావు,పవన్ కుమార్, కట్టా సుబ్బారావు,పసుపులేటి ఫణీంద్ర తదితరులు పాల్గొన్నారు.



