Monday, October 27, 2025
E-PAPER
Homeతాజా వార్తలుద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు

- Advertisement -

నవతెలంగాణ –  మిరుదొడ్డి
జాతీయ రహదారి పై 765 డివైడర్ పై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండల కేంద్రంలో ద్విచక్ర వాహనంపై ఇద్దరు యువకులు రోడ్డు దాటుతున్న క్రమంలో వేగంగా వచ్చిన లారీ బైకును ఢీకొని ప్రమాదం చోటుచేసుకుంది. అక్బర్ పేట బొంపల్లి మండలం ఏనగుర్తి గ్రామానికి చెందిన ప్రభాకర్, ప్రసాద్ లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు భూంపల్లి పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించడంతో పోలీసులు హటావోటిన సంఘటన స్థలాన్ని చేరుకొని బాధితులను 108 సాయంతో ఆస్పత్రి తరలించారు. అనంతరం లారీని అదుపులోకి తీసుకొని యాక్సిడెంట్ కు సంబంధించిన వీడియోను సీసీ కెమెరా ద్వారా రికార్డు చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై హరీష్ తెలిపారు. ప్రమాదానికి గురైన ఇద్దరు వ్యక్తులను సిద్దిపేట ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -