Monday, October 27, 2025
E-PAPER
Homeదర్వాజసమయం లేదు మిత్రమా!

సమయం లేదు మిత్రమా!

- Advertisement -

సెల్‌ఫోన్‌ చూపుతో ఉదయం తెలవారుతోంది,
పొద్దున మొదలైన ఉరుకులు పరుగుల చలనం
విశ్రాంతి లేక అలసి రాత్రి మసకబారుతోంది
జీవనాన్ని కలిసే సమయం లేదు మిత్రమా!
ఇంటర్నెట్‌ సొబగుల్లో కాలం కరిగిపోతోంది,
కలవటం కోసం ఆన్‌లైన్‌లో కనెక్ట్‌ అవుతున్నా,
ముసుగుల వెనుక వెకిలి నవ్వుల అంపశయ్యపై
సహృదయ ఆత్మీయతకు సమయం లేదు మిత్రమా!
షో ఆఫ్‌ చేసే ఫోటోలు వాట్సాప్‌ లో చక్కర్లు కొడుతున్నాయి,
స్నేహితుల పోస్టింగులు ఫేస్‌బుక్‌ లో ఉడికిస్తున్నాయి,
కామెంట్లు, ఎమోజీలే ఇప్పుడు రాజ్యమేలుతున్నాయి,
ఆఫ్‌లైన్‌ మాటలకు సమయం లేదు మిత్రమా!
టెక్నాలజీ బ్రాండ్లు అవసరాలను వెక్కిరిస్తున్నాయి,
మానవ సంబంధాల గడియారాలు ఆగిపోతూ,
వస్తువుల విలువ మనిషిని మించిపోతోంది,
అనుబంధాలను గుర్తు చేసుకునే సమయం లేదు మిత్రమా!
కోరికల వెంట పరుగెడుతూ ఆనందం ఆవిరైపోతోంది,
డబ్బు ఎండమావిలో బతుకు దొర్లిపోతోంది,
ఇప్పుడు సమాజం బిజీగా ఉన్న నిశ్శబ్ద సమాధి
కోల్పోయింది ఏదైనా వెతికి నిలబట్టే సమయం లేదు మిత్రమా!

  • డా. వాసాల వరప్రసాద్‌, 9490189847
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -