- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మంగళవారం పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్, నిర్మల్, నిజామాబాద్, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, MBBD, వరంగల్, HNK, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, SRD, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
- Advertisement -



