నవతెలంగాణ – కామారెడ్డి : కామారెడ్డి జిల్లా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏ ఐ టి యు సి తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ కాంటాక్ట్ ఔట్సోర్సింగ్ వర్కర్స్, ఎంప్లాయిస్ వర్కర్స్. రాష్ట్ర అధ్యక్షులు కే రవిచంద్ర, రాష్ట్ర కార్యదర్శి . వి. జయపాల్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శి ల ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కమిషనర్ రాజేందర్ రెడ్డి కి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, ఆయనకు వినతి పత్రం అందజేశారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షు, కార్యదర్శులు మాట్లాడుతూ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని. సర్వే స్టేషన్ ఎలక్ట్రిషన్, కంప్యూటర్ ఆపరేటర్ సిబ్బంది సమస్యల పరిష్కరించాలని, వారి యొక్క పని భద్రత పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. కార్మికులు మున్సిపల్ లో పనిచేస్తున్న అన్ని రంగాల్లో కార్మికులకు సంవత్సరం సెలవులు, పండగ దినాల సెలవులు, మహిళ కార్మికులకు స్వయం పాలన నిర్దిష్టంగా అమలు చేయాలన్నారు. పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాన్ని చట్టబద్ధంగా అమలు చేయాలని, కామారెడ్డి జనాభా ప్రతిపాదన బట్టి కార్మికులకు సంఖ్యను పెంచాలని ఒక కార్మికుడికి రెండు, మూడు వార్డులుగా అప్పజెప్పడం వల్ల కార్మికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, వారి సమస్యలు పరిష్కరించాలన్నారు. కంప్యూటర్ ఆపరేటర్ కామారెడ్డి పనిచేస్తున్న, శానిటేషన్ కార్మికులు, వాటర్ వర్క్స్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కమిషనర్ వివరించడం జరిగిందన్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. మున్సిపల్ జీవో ప్రకారం సెలవులను కలుపుకొని వేతనాలు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ కామారెడ్డి జిల్లా కార్యదర్శి పి బాలరాజ్, కామారెడ్డి ఏఐటీయూసీ నాయకులు ఎల్ దశరథ్, కామారెడ్డి మున్సిపల్ జిల్లా అధ్యక్షులు, ఏం లక్ష్మణ్, కామారెడ్డి మున్సిపల్ అధ్యక్షులు నర్సింగ్ రావు, సుదర్శన్, ఆర్ లక్ష్మణ్, జి రాజు, సుదర్శన్ కార్మికులు పాల్గొన్నారు.
మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: ఏఐటియుసి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



