– లక్ష టన్నుల మైల్ స్టోన్
– రాష్ట్రంలోనే ప్రధమ పామాయిల్ పరిశ్రమ
– రుజువైన ఓల్డ్ ఈజ్ గోల్డ్ నానుడి
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఆయిల్ఫెడ్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అశ్వారావుపేట లో నిర్మించిన ప్రధమ పామాయిల్ పరిశ్రమ పాతది అయినప్పటి చిన్నపాటి సాంకేతిక, యాంత్రిక ఆటంకాలను అధిగమిస్తూ ఈ ఏడాది సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. ఈ ఆయిల్ ఇయర్ లో ఆయిల్ ఫెడ్ నిర్దేశించిన 1 లక్షా 1 వేయి టన్నుల పామాయిల్ గెలలు ఎఫ్.ఎఫ్.బీ (ఫ్రెష్ ఫ్రూట్ బంచెస్) క్రస్సింగ్ లక్ష్యాన్ని అవలీలగా అధిగమించి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనిపించింది. పామాయిల్ చరిత్రలోనే అశ్వారావుపేట పామాయిల్ పరిశ్రమ మొదటిసారిగా అత్యధిక గెలలు గానుగ ఆడి దాని పనితనాన్ని నిరూపించింది.
ఆయిల్ ఫెడ్ నవంబర్ 1 వ తేదీ నుంచి అక్టోబరు 31 వ తేదీ వరకు ఆయిల్ ఇయర్ గా పరిగణిస్తుంది. ఈ ఏడాది ఆయిల్ ఇయర్ ఈ నెల 31 తేదీ శుక్రవారం తో ముగియనుంది.అయితే గత నాలుగు రోజుల క్రితానికే 1 లక్ష టన్నుల గెలల క్రషింగ్ లక్ష్యాన్ని సాధించింది.
ఈ పరిశ్రమను 2006 లో 5 టన్నుల సామర్థ్యంతో ప్రారంభమై నేడు 30 టన్నుల సామర్థ్యానికి పెరిగిన అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీ పాత ఫ్యాక్టరీ.ప్రస్తుతం ఉన్న ఆధునిక సాంకేతికత ఈ ఫ్యాక్టరీ లో పూర్తిగా అందుబాటులో లేదు.పాత ఫ్యాక్టరీ లో తరుచూ అంతరాయాలు ఏర్పడుతున్నప్పటికీ..దీనికి అనుబంధంగా గత ఏడాది ప్రారంభించిన పవర్ ప్లాంట్ సహాయంతో విద్యుత్ అంతరాయాలను అధిగమిస్తూ మరమ్మతులను ఎప్పటికప్పుడు చేసుకుంటూ లక్ష టన్నులు క్రషింగ్ సాధించడం విశేషం.
అందరి సహకారం మే లక్ష్యానికి చేరువ చేసింది – నాగబాబు,పామాయిల్ ఫ్యాక్టరీ మేనేజర్ ఈ ఆయిల్ ఇయర్ లో లక్ష టన్నుల గెలల క్రషింగ్ చేయాలనే లక్ష్యాన్ని నాలుగు రోజులు ముందుగానే సాధించగలగటం సంతోషంగా ఉందని మేనేజర్ నాగ బాబు అన్నారు. పవర్ ప్లాంట్ ఏర్పాటు,మరమ్మత్తులు ను ఎప్పటికపుడు తక్షణమే పునరుద్ధరించుకోవడం ద్వారా,అందరి సహకారంతో ఇది సాధ్యమైందన్నారు. మొదటిసారిగా అశ్వారావుపేట ఫ్యాక్టరీ ఈ ఘనత సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
ఆయిల్ ఇయర్ 01 నవంబర్ 2024 – 31 అక్టోబర్ 2025 వరకు
నెల గెలలు(టన్ను ల్లో)
నవంబర్
డిసెంబర్
జనవరి 2250
ఫిబ్రవరి 4740
మార్చి 9286
ఏప్రియల్ 12467
మే 11770
జూన్ 12085
జులై 12001
ఆగస్ట్ 12328
సెప్టెంబర్ 13195
అక్టోబర్ 11020
మొత్తం 1,01,000
సంవత్సరం వారీగా…
సంవత్సరం గెలలు (టన్ను ల్లో)
2020 – 2021 78300
2021 – 2022 76400
2022 – 2023 79003
2023 – 2024 47800
2024 – 2025 1,01,000



