పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి

– ఎస్ఎఫ్ఐ నాయకుల డిమాండ్ 

నవతెలంగాణ కంఠేశ్వర్:

పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నిజాంబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ మరియు మిస్ కాస్మోటిక్ చార్జీల బిల్లులను విడుదల చేయాలని కలెక్టర్ కార్యాలయం నందు ధర్నా నిర్వహించి, ఏవో ప్రశాంత్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నగర కార్యదర్శి పోషమైన మహేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగు సంవత్సరాల నుండి స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో చెల్లించడం లేదని, ఈ బకాయిలు దాదాపు 5177 కోట్లు ఉన్నాయి. అయితే విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత పై చదువుల రీత్యా ఉద్యోగాల రిత్యా విద్యార్థులు తమ సర్టిఫికెట్లు తీసుకుందామని ప్రైవేట్ కాలేజీలకు వెళ్లినప్పుడు స్కాలర్షిప్ రాని కారణంగా సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అలాగే సంక్షేమ హాస్టల్లో గత సంవత్సర కాలంగా మెస్ కాస్మోటిక్ చార్జీల బిల్లులు పెండింగ్లో ఉన్న కారణంగా హాస్టల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించడం లేదు. దీనివలన విద్యార్థులు తరచుగా అనారోగ్య సమస్యలు గురి అవుతున్నారు అని అన్నారు. కాబట్టి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ మరియు రియంబర్స్మెంట్ అలాగే బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు విశాల్, నగర ఉపాధ్యక్షులు గణేష్, నగర నాయకులు శివ, మోతిలాల్, పవన్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love