దిద్దుబాటు చర్యలు తీసుకుంటాం
సర్, డీలిమిటేషన్‌తో బీజేపీ మోసపూరిత వైఖరి బట్టబయలు
యుద్ధం సాకుతో పెట్రో ధరల పెంపు
కార్మిక, కర్షక వ్యతిరేక చర్యలను
నిరసిస్తూ ప్రతిఘటనా పోరాటాలు
జూన్‌లో సామ్రాజ్య వ్యతిరేక ప్రచారం
సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ నిర్ణయాలు
చట్టసభల్లో మహిళా రిజర్వేషన్‌ను తక్షణమమే అమలు చేయాలని కోరుతూ మహిళా సంఘాలు పిలుపిచ్చిన నిరసనలకు మద్దతునివ్వాలని కేంద్ర కమిటీ నిర్ణయించింది. ఎన్నికల కమిషన్ పక్ష పాత పాత్ర, పాలక పార్టీకి అనుబంధంగా దాని చర్యలపై ఈ ప్రచారం దృష్టి కేంద్రీ కరిస్తుంది. లేబర్ కోడ్‌ల నోటిఫికేషన్‌కు వ్యతిరేకంగా కూడా ప్రచారం నిర్వహించనుంది. కార్మికులకు అండగా పార్టీ నిలబడుతుందని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ : ఈ నెల 22-24 తేదీల్లో ఢిల్లీలోని హరికిషన్ సింగ్ సూర్జిత్ భవన్‌లో సమావేశమైన సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ పలు అంశాలపై కూలంకషంగా చర్చించింది. ఇటీవల వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, సర్, డీలిమిటేషన్‌పై బీజేపీ మోసపూరిత వైఖరి, దేశంలో పెరుగుతున్న పెట్రో ధరల పెంపు, కార్మికుల సమస్యల, పోరాటాలు వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకుంది.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
ఇటీవల వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెనుక గల రాజకీయ, నిర్మాణపరమైన, సైద్ధాంతిక కారణాలపై కేంద్ర కమిటీ ప్రాధమికంగా చర్చించింది. అసెంబ్లీ ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బకు గల కారణాలను అర్ధం చేసుకోవడానికి కేరళం రాష్ట్ర కమిటీ ఇప్పటికే పార్టీలోని వివిధ స్థాయిల నుండి అభిప్రాయాలు సేకరించే ప్రక్రియను ప్రారంభించింది. తిరువనంతపురంలో జూన్ 5-8 తేదీల్లో జరగనున్న రాష్ట్ర కార్యదర్శివర్గం, రాష్ట్ర కమిటీ సమావేశాల్లో ఈ అభిప్రాయాలన్నింటినీ కూలంకషంగా చర్చిస్తారు. కేంద్ర కమిటీ ఈ ఏడాది జులై రెండో అర్ధభాగంలో సమావేశమై అన్ని రాష్ట్రాల సమీక్షలను ప్రాతిపదికగా చేసుకుని మొత్తంగా ఎన్నికల ఫలితాల కూలంకషంగా సమీక్షిస్తుంది. గుర్తించిన బలహీనతలను సరిదిద్దుకోవడమనేది పై నుండి కిందిస్థాయి వరకు తక్షణమే చేపట్టబడుతుంది.
యుద్ధ ప్రభావం
యుద్ధాన్ని సాకుగా చూపిస్తూ ప్రభుత్వం ఇంధన ధరలను, ఎల్‌పీజీ సిలిండర్లు ముఖ్యంగా వాణిజ్య సిలిండర్ల ధరలను విపరీతంగా పెంచింది. ఇక ఎన్నికల ఫలితాలు ప్రకటించిన వెంటనే, గత 11 రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలను పలుసార్లు పెంచడం ద్వారా లీటరుకు రూ.7కి పైగా పెరిగాయి. పెరుగుతున్న ఇంధన ధరలు, దీనితో పాటూ పొదుపు చర్యలు ఈ రెండూ కలిసి ప్రజలపై అపారమైన భారాన్ని మోపుతున్నాయి. కేంద్రం ఘోరంగా విఫలమైంది.
ఎరువుల లభ్యత
ఎరువుల నిల్వలను తగినంతగా వుంచడంలో మోడీ సర్కారు విఫలమవడంతో రైతాంగం తీవ్రంగా ఎరువుల కొరతను ఎదుర్కొనడంతో పాటూ వ్యయాల పెంపును కూడా భరించాల్సి వస్తోందనీ, వ్యవసాయ సీజను సమీపిస్తున్నందున తక్షణమే ఎరువులను ఎలాంటి అడ్డూ ఆటంకాలు లేకుండా లభ్యమయ్యేలా చూడాలని డిమాండ్ చేస్తూ రైతాంగాన్ని నాయకత్వం వహించేందుకు పార్టీ చొరవ తీసుకుంటుందని స్పష్టం చేసింది.
గ్రామీణ ఉపాధి హామీ
వీబీ గ్రామ్ జీ చట్ట ముసాయిదా నిబంధనలను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. వీబీ గ్రామ్ జీని రద్దు చేయాలని, ఆ స్థానంలో పనికి, వేతనాల పెంపునకు హమీ కల్పిస్తూ మరింత పటిష్టమైన ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏను తీసుకురావాలన్న డిమాండ్‌ను కేంద్ర కమిటీ పునరుద్ఘాటించింది.
మతోన్మాద ముప్పు
చారిత్రక, మతపరమైన వివాదాలను తిరగ దోడుతూ,వాటిపై మళ్ళీ తీర్పులివ్వడమనే పెరుగుతున్న ధోరణిలో భోజ్‌శాలా-కమల్ మౌలా మసీదు కేసులో మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఒక భాగమనీ, ఇది మతోన్మాద విభేదాలను మరింత పెచ్చరిల్లచేసే ముప్పను కలిగిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో కదులుతున్న బస్సులో ఇటీవల జరిగిన సామూహిక లైంగికదాడి, మన దేశంలో మహిళలపై పెరుగుతున్న లైంగిక దాడులకు ఒక నిదర్శనం. అనేక రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండడం, పైగా పాలనా యంత్రాంగంపై మనువాదీ సిద్ధాంతాల ప్రభావం బాగా ఉండడంతో కుల, లింగ వివక్ష, హింసలను ఎదుర్కొంటున్న బాధితులు తమకు జరిగిన అన్యాయాలను చెప్పుకోవడానికి, నేరాల గురించి రిపోర్ట్ చేయడానికి కూడా కష్టంగా మారుతోందని వివరించింది.
నీట్ పేపర్ లీక్
నీట్ పరీక్షా పత్రం లీకవడం వెనుక బీజేపీ నేతలు ఉన్నారనేది స్పష్టమవుతోంది. ఎన్‌టీఏను తక్షణమే రద్దు చేయాలి, పరీక్షల నిర్వహణను వికేంద్రీకరించాలి. గతంలో మాదిరిగా, సంబంధిత ప్రభుత్వ సంస్థలకు ఆ బాధ్యతలను అప్పగించాలి. లీకేజీపై కూలంకషంగా దర్యాప్తు నిర్వహించాలి. దోషులందరినీ శిక్షించాలి. సీజేపీ సోషల్ మీడియా హ్యాండిల్‌పై నిషేధం, సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేలపై దాడిని కేంద్ర కమిటీ ఖండించింది. జూన్-జులైల్లో నిర్వహించే ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌ను ప్రసారం చేసేందుకు తక్షణమే భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కేంద్ర కమిటీ డిమాండ్ చేసింది.
క్యూబాకు బెదిరింపులు
క్యూబాను స్వాధీనం చేసుకుంటామని, సైనిక చర్య తప్పదని అమెరికా చేస్తున్న బెదిరింపులను కేంద్ర కమిటీ ఖండించింది. క్యూబా మాజీ అద్యక్షుడు రావుల్ కాస్ట్రోను అమెరికా కోర్టులో అభిశం సించడం మరో దురాక్రమణ చర్యగా అభివర్ణించింది. ఇరాన్, పాలస్తీనా, వెనిజులా, క్యూబాలపై అమెరికా దురాక్రమణను ఖండిస్తూ జూన్ నెలలో పార్టీ విస్తృతంగా సామ్రాజవ్యాద వ్యతిరేక ప్రచారాన్ని నిర్వహించనుంది.
ఇండియా బ్లాక్
ఇతర ప్రతిపక్ష పార్టీల పట్ల కాంగ్రెస్ ధోరణి, ఆర్‌ఎస్‌ఎస్-బీజేపీపై సమైక్య పోరాటం సాగించేందుకు లౌకికవాద శక్తులన్నీ ఏకతాటిపైకి రావడానికి ఏ మాత్రమూ దోహదపడదు. బీజేపీతో సీపీఐ(ఎం) ఒప్పందం కుదుర్చుకుంది అంటూ కేరళం అసెంబ్లీ ఎన్నికల సమయంలో మా పార్టీకి వ్యతిరేకంగా కొంతమంది కాంగ్రెస్ సీనియర్ నేతలు చేసిన ఆరోపణలు నిరాధారమని కేంద్ర కమిటీ ఖండించింది.
నియోజకవర్గాల పునర్విభజన
నియోజకవర్గాల పునర్విభజ చేపట్టే పేరుతో దేశ ఎన్నికల మ్యాప్‌ను మార్పు చేసే తన ఎజెండాను బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించింది. నియోజవర్గాల పునర్విభజనను మహిళా రిజర్వేషన్ అమలుతో ముడిపెట్టడానికి చూసింది. దీన్ని బట్టి తన ఎజెండాను అమలు చేసేందుకు ప్రభుత్వ సంస్థలను సమర్ధవంతంగా బీజేపీ ఉపయోగించుకుంటోందని దీంతో మరోసారి నిరూపితమైంది.
సర్
ఒక రాజకీయ పార్టీ ప్రయోజనాలను కాపాడేందుకు గానూ ఓటర్ల జాబితాల్లో అవకతవకలకు పాల్పడడమనేది స్వతంత్ర భారత చరిత్రలో ఎన్నడూ జరగలేదని పేర్కొంది. ఈ మొత్తం ప్రక్రియ మన ఎన్నికల వ్యవస్థ విశ్వసనీయతను దెబ్బతీసిందని వివరించింది. సర్ ప్రక్రియలో ఓటర్ల జాబితాల నుంచి పేర్లు తొలగించబడిన వారికి ప్రభుత్వ ప్రయోజనాలు అందబోవని బీహార్, బెంగాల్‌ల్లోని బీజేపీ ప్రభుత్వాలు ప్రకటించడం ప్రజాస్వామ్య సూత్రాలకు పూర్తి విరుద్ధమని స్పష్టం చేసింది.
భారత దేశ ఆర్థిక వ్యవస్థ భారతదేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కొనసాగుతోంది. పొదుపు చర్యలు
పాటించాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేయడం ద్వారా స్వయంగా ప్రధానే పరోక్షంగా అంగీకరించారు. అనేక రంగాల వారీగా నిరుద్యోగం పెరుగుతోంది. అత్యధిక అదాయం, సంపదలకు సంబంధించి తీవ్ర అసమానతల రేట్లతో ప్రపంచంలోనే అత్యంత అసమానతలు కలిగిన దేశంగా భారత్ కొనసాగుతోంది. రూపాయి విలువ చారిత్రకంగభా కనిష్ట స్థాయికి దిగజారింది.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కూలంకష సమీక్ష జరుపుతాం
- Advertisement -
- Advertisement -



