Sunday, September 6, 2026
E-PAPER
Homeక్రైమ్ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎర్రవల్లి జాతీయ రహదారిపై చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ నుంచి వస్తున్న కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాద ధాటికి కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న సాయిరాం, మౌనిక అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతులను హైదరాబాద్ వాసులుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -