– సెల్ ఫోన్లు గన్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు
– సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి
నవతెలంగాణ – మిరుదొడ్డి / సిద్దిపేట అర్బన్
తుపాకితో ఆర్ఎంపీ డాక్టర్ ను బెదిరించిన సంఘటన ను పోలీసులు రెండు రోజుల్లో చేదించారు. అక్బర్ పేట భూంపల్లి మండలం రుద్రవరం గ్రామంలో గత రెండు రోజుల క్రితం ఆర్ఎంపీ డాక్టర్ ఇంటి వద్దకు వెళ్లి ఇద్దరూ అఘాంతకులు తుపాకితో బెదిరించిన విషయాన్ని తెలుసుకున్న మీరు దొడ్డి పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకొని కేసును పర్యవేక్షించారు సిద్దిపేట ఏసిపి రవీందర్ రెడ్డి దుబ్బాక శ్రీనివాస్, మిరుదొడ్డి ఎస్సై సమంత, భూంపల్లి ఎస్సై హరీష్ లు బెదిరింపులకు పాల్పడిన నలుగురు వ్యక్తులను పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామానికి చెందిన బిక్షపతి కాస్లాబాద్ గ్రామానికి చెందిన బ్రహ్మం అక్బర్ పేట భూంపల్లి మండలం రుద్రారం గ్రామానికి చెందిన నర్సింలు కమలాకర్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మొగిలి బిక్షపతి గత పది సంవత్సరాల నుండి జనశక్తి పార్టీలో పనిచేస్తూ ఉండేవాడు బ్రహ్మం కాసులభ గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవన కొనసాగిస్తున్నారు. వీరిద్దరూ గత కొంతకాలంగా డబ్బులు ఎలా సంపాదించాలనే ఉద్దేశంతో తుపాకిని సంపాదించి తుపాకితో బెదిరి బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్న గ్యాంగ్ ఏర్పడింది ఒక ప్లాన్ ప్రకారం ఆయన యొక్క వ్యక్తిగత కక్షతో లక్ష్మి నరసయ్య ఆర్ఎంపిని గ్రామంలో ఎక్కువ ఫేమస్ కావడంతో అతనిపై కక్షతో ఇలాంటి సంఘటనలకు పాల్పడినట్లు తెలిపారు. మొగిలి బిక్షపతి బ్రహ్మంపై పోలీస్ స్టేషన్లో కొన్ని కేసులు ఉన్నాయన్నారు. గ్రామాల్లో ఎవరైనా బెదిరింపులకు పాల్పడిన చట్టపర వ్యతిరేకమైన కార్యక్రమాలకు పాల్పడితే వెంటనే వందనంబర్ కు సమాచారం అందించాలని తెలిపారు. పోలీసులు ప్రజలకు ఎల్లవేళలా ప్రాణరక్షణకు అందుబాటులో ఉంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో దుబ్బాక సీఐ శ్రీనివాస్ ఎస్సై సమంత భూంపల్లి ఎస్సై హరీష్ తోపాటు మిరుదొడ్డి భూంపల్లి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.



