రాజస్తాన్‌లో సీపీఐ(ఎం) భారీ నిరసన సభ
సికార్ : ప్రజా సమస్యలు పరిష్కరించకుండా..వారిపై భారాలు వేయటం తగదని సీపీఐ(ఎం) పోలిట్‌బ్యూరో సభ్యులు అమ్రారామ్ హెచ్చరిక చేశారు. రాజస్తాన్‌లోని బీజేపీ సర్కార్ స్మార్ట్ మీటర్లు, నిరుద్యోగ సమస్యలతో పాటు మరెన్నో ప్రధానమైన అంశాలపై దృష్టిపెట్టడంలేదని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర పాలకులు సమస్యలు పరిష్కరించకపోతే.. ప్రజా ఉద్యమాలు చేపడతామని అమ్రారామ్ స్పష్టం చేశారు. అంతకు ముందు సికార్ నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలంటూ బ్యానర్లు, ప్లకార్డులు పట్టుకుని నినదించారు. అనంతరం బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్యాచరణ సిద్ధం చేయనున్నట్టు సీపీఐ(ఎం) నాయకులు ప్రకటించారు.
ప్రజలపై భారాలు మోపొద్దు
- Advertisement -
- Advertisement -

 
                                    