- Advertisement -
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రైతు ఉద్యమ నేత సామినేని రామారావును హత్యచేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి టి స్కైలాబ్‌బాబు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజా ఉద్యమాలను హత్యారాజకీయాలతో ఆపలేరని తెలిపారు. సామినేని మృతికి తీవ్ర సంతాపాన్ని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.
- Advertisement -



