Saturday, November 1, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఏసీబీకి చిక్కిన విద్యుత్‌ డీఈ షేక్‌ చాంద్‌ షరీఫ్‌ బాషా

ఏసీబీకి చిక్కిన విద్యుత్‌ డీఈ షేక్‌ చాంద్‌ షరీఫ్‌ బాషా

- Advertisement -

నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
ఫౌల్ట్రీ ఫామ్‌కు ట్రాన్స్‌ఫార్మర్‌ మంజూరు కోసం లంచం డిమాండ్‌ చేసిన పాపన్నపేట ట్రాన్స్‌కో డీఈ షేక్‌ చాంద్‌ షరీఫ్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఘటన మెదక్‌ జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలం సీతానగర్‌ గ్రామానికి చెందిన పాపన్నగారి భాస్కర్‌ ఫౌల్ట్రీ ఫారం ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆ పౌల్ట్రీ ఫారంకు 25కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ అవసరం ఉందని పాపన్నపేట ట్రాన్స్‌కో ఏఈని సంప్రదించాడు. రూ.1.10లక్షలతో నూతన ట్రాన్స్‌ఫార్మర్‌ కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

అందుకోసం అధికారులు కొంత డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేయగా పౌల్ట్రీ ఫామ్‌ యజమాని భాస్కర్‌ వాళ్లు అడిగిన డబ్బులు ఇవ్వలేదని రూ.2.09లక్షలకు పెంచి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దాన్ని తగ్గించడానికి విద్యుత్‌ డీఈకి రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేయగా రూ.30 వేలు ఇచ్చేందుకు ఒప్పందం జరిగింది. అందులో నుంచి రూ.9 వేలు ఓ వ్యక్తికి ఫోన్‌ పే చేశారు. మిగతా రూ.21వేలును గురువారం ట్రాన్స్‌కో డీఈ కార్యాలయంలో ఇస్తుండగా.. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌ తన సిబ్బందితో కలిసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం మెదక్‌లో డీఈ ఉంటున్న అద్దె ఇంటితో పాటు మెహిదీపట్నంలోని ఆయన స్వంత ఇంట్లో అధికారులు సోదాలు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -