- Advertisement -
ఏడేళ్లుగా కారు డెలివరీ చేయలేదని విమర్శ
వాషింగ్టన్ : ఎలన్ మస్క్‌కు చెందిన టెస్లా కార్ల కంపెనీలపై ఓపెన్‌ఎఐ సిఇఒ శామ్‌ఆల్ట్‌మాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2018 జులైలో 50,000 డాలర్లతో టెస్లా రోడ్‌స్టర్ బుక్ చేసుకున్నారు. ఏడేళ్లయిన ఇప్పటికీ కారు డెలివరీ చేయలేదని ఆల్ట్‌మాన్ ఎక్స్‌లో పోస్టు చేశారు. తన డబ్బు కూడా రీఫండ్ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా ఆయన పంచుకున్నారు. ఇందులో 2018 జులై 11న కారును బుక్ చేసినట్లు తెలుస్తోంది.
- Advertisement -



