ఎవరెన్ని స్కీములు పెట్టినా.. ఎవరెన్ని కార్యక్రమాలు చేపట్టినా.. రైతు మాత్రం ఆగమైపోతుండు. ఆరుగాలం శ్రమించి, చివరకు పంట చేతికొచ్చే వేళ… కోడిపిల్లను గద్దలు తన్నుకుపోయినట్టు… అకాల వర్షాలు, వరదలు అన్నదాతను నట్టేట ముంచుతున్నాయి.
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల్ల రైతులు తీవ్రంగా నష్ట పోయారు. కల్లాలు లేక, ఉన్నా అవి సరిపోక, తేమ ఉన్న ధాన్యాన్ని రోడ్లమీదనే ఆరబోస్తే…ముంచుకొచ్చిన ‘మొంథా’కి ఆ వడ్లన్నీ నీటిపాలయే. దీంతో దిక్కుతోచక, ఏం చేయాలో తెలియక రైతన్నలు ‘మమ్మల్ని ఆదుకోండి మహాప్రభో…’ అంటూ దీనంగా వేడుకుం టున్నారు. అందుకే పాలకురాలా… జర సోచాయించండి… సర్వరోగ నివారిణి జిందా తిలస్మాత్‌లాగా, పెద్దాయన స్వామినాథన్ చెప్పిన సిఫారసులను అమలు చేయండి, రైతులను అన్ని బాధల నుంచి విముక్తుల్ని చేయండి…
-కే.నరహరి
ఆదుకోండి మహాప్రభో…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


