అమెరికా అణు పరీక్షలపై తేల్చి చెప్పిన నిపుణులు
చైనాకు లైసెన్స్ ఇచ్చినట్లేనని వ్యాఖ్య
వాషింగ్టన్ : అణు పరీక్షలు జరపాలన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అణు పరీక్షలు జరిపేందుకు అమెరికాలో ఒకే ఒక ప్రదేశం ఉంది. లాస్ వేగాస్ సమీపంలోని నెవాడా వద్ద అది మూడు దశాబ్దాల క్రితం అణు పరీక్ష నిర్వహించింది. ఇప్పుడు ఆ ప్రదేశాన్ని అణు పరీక్షకు సిద్ధం చేయాలంటే వందల మిలియన్ డాలర్లు ఖర్చవుతాయని, కనీసం రెండు సంవత్సరాల సమయం పడుతుందని అణు నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇప్పటికిప్పుడు అణు పరీక్షలు జరపడం సాధ్యం కాదని అమెరికా న్యూక్లియర్ రెగ్యులేటరీ కమిషన్ మాజీ ఛైర్మన్ గ్రెగరీ జాకో స్పష్టం చేశారు. అణు పరీక్షలను తిరిగి ప్రారంభించాల్సిన సాంకేతిక అవసరమేమీ అమెరికాకు లేదని కొందరు నిపుణులు తేల్చి చెప్పారు. పైగా వాటిని నిర్వహిస్తే చైనా వంటి దేశాలకే ప్రయోజనకరమని వ్యాఖ్యానించారు. ఆయా దేశాలు అణు కార్యక్రమాలు చేపట్టడానికి లైసెన్స్ ఇచ్చినట్లు అవుతుందని చెప్పారు.
అమెరికా ఇప్పటి వరకూ 1,054 అణ్వాయుధ పరీక్షలు నిర్వహించింది. అయితే 1992 నుంచి వాటి జోలికి పోలేదు. మరోవైపు చైనా కేవలం 47 పరీక్షలు మాత్రమే జరిపింది. ఒకవేళ అమెరికా కనుక అణు పరీక్షలను తిరిగి ప్రారంభిస్తే చైనా కూడా మొదలు పెడుతుందని నిపుణులు హెచ్చరించారు. ఏదేమైనా వాస్తవానికి వెంటనే పరీక్షలు జరపడం సాధ్యం కాదని, పైగా ఎదురు దెబ్బలు తగులుతాయని వారు హితవు పలికారు. ఇదిలావుండగా అణు పరీక్షలపై ట్రంప్ చేసిన ప్రకటనను పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఇది బాధ్యతారహితమైన తిరోగమన చర్య అని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ విమర్శించారు. రక్షణ శాఖకు యుద్ధ శాఖ అని పేరు పెట్టడాన్ని కూడా ఆయన తప్పుపట్టారు. తాము చేపట్టిన శాంతియుత అణు కార్యక్రమంపై నిప్పులు చెరుగుతున్న అమెరికా ఇప్పుడు పరీక్షలకు సిద్ధమవడమేమిటని ప్రశ్నించారు.
ఇతర దేశాలు జరిపితే…
భూగర్భ అణు పరీక్షలను తిరిగి ప్రారంభిస్తామని ట్రంప్ శుక్రవారం సూచనప్రాయంగా తెలిపారు. అయితే వాటిని నిజంగానే ప్రారంభిస్తారా అనే విషయంపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. త్వరలోనే మీకు ఆ విషయం తెలుస్తుందని మాత్రం చెప్పారు. ఇతర దేశాలు అణు పరీక్షలు జరిపితే తామూ నిర్వహిస్తామని పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు జవాబుగా ట్రంప్ అన్నారు. ‘ఇతర దేశాలు జరిపితే మేమూ కొన్ని పరీక్షలు నిర్వహిస్తాం. వారు చేస్తే మేమూ చేస్తాం’ అని తెలిపారు.
అంత ఈజీ కాదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



