పంటలపై అధిక వర్షాల ప్రభావం
సరైన ధర కల్పించని ప్రభుత్వాలు
నవతెలంగాణ-సిర్పూర్(టి)
ఈయేడు రైతుల పరిస్థితి దారుణంగా మారింది. అధిక వర్షాలు పంటల దిగుబడిపై ప్రభావం చూపాయి. పంట చేతికిచ్చిన తరువాత కూడా మార్కెట్‌లో సరైన ధర లేకపోవడంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక మానోవేదనతో రైతు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టి) మండలం చింతకుంటలో జరిగింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతకుంటకు చెందిన రైతు పిట్టల కిష్టయ్య (64) తనకు ఉన్న ఐదు ఎకరాలల్లో పత్తి సాగు చేశాడు.. వరుసగా కురిసిన వర్షాలతో పంట దెబ్బతింది.
పంట కోసం తెచ్చిన పెట్టుబడులు, ఫర్టిలైజర్ దుకాణంలో ఎరువులు, విత్తనాలు తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించాల్సి ఉంది. అలాగే బ్యాంకులో దాదాపు రూ.రెండు లక్షల రుణం ఉంది. దిగుబడి కూడా ఆశాజనకంగా లేదు. మార్కెట్‌లో సరియైన ధరల లేదు. అప్పులు ఎలా తీర్చాలనే ఆలోచనలతో మానసిక ఒత్తిడికి గురై ఆవేదనలో కిష్టయ్య ఆత్మహత్యకు దారితీసింది. శుక్రవారం సాయంత్రం పురుగులమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు సభ్యులు వెంటనే సిర్పూర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల తరలిస్తుండగా మార్గమధ్యతో మరణించారు. మృతుడి భార్య దుర్గమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్టు ఎస్సై సురేష్ తెలిపారు.
అప్పుల భారంతో రైతు ఆత్మహత్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



