- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చింది. అలాగే మంత్రి పదవులు ఆశించిన బోధన్ సుదర్శన్ రెడ్డికి సలహాదారు పదవి, ప్రేమ్ సాగర్ రావుకు సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టింది. దీంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. ఎప్పటి నుంచే మంత్రి పదవి ఆశిస్తున్న రాజగోపాల్‌కు త్వరలోనే పదవి వరించే అవకాశం ఉంది. కేబినెట్‌లో మరో రెండు ఖాళీలు ఉండగా రాజగోపాల్‌కు పదవి పక్కా అనే చర్చ సాగుతోంది.
- Advertisement -



