Sunday, August 23, 2026
E-PAPER
Homeక్రైమ్ఘోరం..ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య..

ఘోరం..ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : పల్నాడు జిల్లా వినుకొండ గ్రామీణ మండలం విఠంరాజుపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో తన ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఉరేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. విఠంరాజుపల్లికి చెందిన నక్కా భారతి(24)కి సునీల్‌రెడ్డితో వివాహమైంది. వీరికి తేజేష్‌రెడ్డి (6), హేమనాథ నాగి రెడ్డి (4) ఇద్దరు కుమారులు ఉన్నారు. పాల వ్యాను డ్రైవర్‌గా సునీల్‌రెడ్డి పనిచేస్తున్నారు. కొంతకాలంగా దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. రాత్రి భర్త విధులకు వెళ్లిన తర్వాత.. భారతి తన ఇద్దరు కుమారులకు విషం ఇచ్చి చంపింది. అనంతరం ఆమె కూడా ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భర్త చెడు వ్యసనాలకు బానిసై కుటుంబ పోషణను పట్టించుకోకపోవడంతో ఇద్దరు పిల్లలను చంపి భారతి కూడా ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -