- రెజర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా
నవతెలంగాణ-హైదరాబాద్: మహిళా రెజ్లర్ల లైంగిక వేధింపుల కేసులో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) మాజీ అధ్యక్షుడు, బీజేపీ నేత బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను నిర్దోషిగా ప్రకటిస్తూ సోమవారం ఢిల్లీ రెవెన్యూ కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో బ్రిజ్ భూషణ్ తో పాటు సహ నిందితుడు వినోద్ తోమర్‌ను కూడా నిర్దోషులుగా ప్రకటిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపై ప్రముఖ రెజర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
పై కోర్టుకు అప్పీల్ చేస్తాం, తాము ఆశ కోల్పోలేదని, తమ పోరాటాన్ని కొనసాగిస్తామని సోమవారం వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా తెలిపారు. అధికార రాజకీయ నాయకుడిపై వీధుల్లోకి వచ్చి పోరాటం చేశామని, ఆ పోరాట ఫలితంతో బ్రిజ్ భూషణ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ఎక్స్ వేదికగా పోస్ట్‌లో పేర్కొన్నారు.
కోర్టు తీర్పు కొంచెం అసహనానికి గురి చేసిందని, “బ్రిజ్ భూషణ్‌పై మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి, కోర్టు ఆయన్ని దోషిగా నిర్ధారించకపోవడం మాకు తీవ్ర విచారాన్ని కలిగించింది,” అని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. పలువురు మహిళా రెజ్లర్లు దృఢంగా నిలబడి తమ న్యాయ పోరాటాన్ని కొనసాగించారని తెలియజేశారు. ఏదీ ఏమైనా తమకు న్యాయవ్యవస్థపై తమకు ఇంకా విశ్వాసముందని వెల్లడించారు.



