నిజామాబాద్ లో ఏకధాటి వర్షం.. రైతుల్లో హర్షం
నవతెలంగాణ- నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
వర్షంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఏకధాటిగా వర్షం కురియడంతో పంటలకు ప్రాణం పోసినట్టయింది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతాయని వరి బదులు ఇతర ఆరు తడి పంటల సాగు చేయాలని వ్యవసాయాధికారులు ముందస్తు ప్రచారం చేశారు. అయినా ఆ సమయంలో కురిసిన భారీ వర్షాలతో వరి సాగుకే రైతులు మొగ్గుచూపారు. అడపాదడపా కురుస్తున్న వర్షాలతో సీజన్‌లో సగం కాలం నెట్టుకొచ్చారు. తదనంతరం వర్షాలు సైతం లేక.. పలు చోట్ల వరి మడులు ఎండుతున్నాయి. పరిస్థితి ఇలానే ఉంటే మరింత పైర్లు ఎండుముఖం పట్టే అవకాశం ఉన్న తరుణంలో శుక్రవారం ఏకధాటిగా రెండు గంటల పాటు కురిసిన భారీ వర్షంతో పంటలకు జీవం వచ్చినట్టయ్యింది. ఇలాంటి వర్షం మరో రెండుసార్లు కురిస్తే పంటలు గట్టెక్కే అవకాశం ఉందని రైతులు భావిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షాకాలం సీజన్‌లో మొత్తం 5.48 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవ్వగా అందులో వరి అత్యధి కంగా 4.36 లక్షల ఎకరాల్లోసాగైంది. సెప్టెంబర్ 11వ తేదీ వరకు జిల్లాలో సాధరణ వర్షపాతం 779.3 మిలీమీటర్లు నమోదు కావాల్సి ఉండగా.. 662.3 మి.మీ నమోదు అయ్యింది. 15 శాతం లోటు ఉంది. అదే విధంగా కామారెడ్డి జిల్లా మొత్తం 5.53 లక్షల ఎకరాల్లో 3.19 లక్షల ఎకరాల్లో వరి, ఇతర విస్తీర్ణంలో ఆరుతడి పంటలు సాగువుతున్నాయి.
పంటలకు జీవం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



