Saturday, September 12, 2026
E-PAPER
Homeతాజా వార్తలుకేపీహెచ్‌బీ లులు మాల్‌లో గన్ కలకలం

కేపీహెచ్‌బీ లులు మాల్‌లో గన్ కలకలం

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న లులు మాల్‌లో గన్ కలకలం సృష్టించింది. మాల్ పార్కింగ్ ప్రాంతంలో రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వారి వాగ్వాదంపై సమాచారం అందుకున్న KPHB పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా పోలీసుల దృష్టికి పాతబస్తీకి చెందిన సిద్దిఖీ అనే వ్యక్తి జేబులో గన్ ఉండటాన్ని గుర్తించారు. అప్రమత్తమైన KPHB సీఐ రాజశేఖర్ రెడ్డి వెంటనే ఆయుధాన్ని స్వాధీనం చేసుకుని సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -