Monday, August 3, 2026
E-PAPER
Homeజాతీయంకొనసాగుతున్న బైపోల్ కౌంటింగ్

కొనసాగుతున్న బైపోల్ కౌంటింగ్

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: మధ్యప్రదేశ్‌లోని దతియా, బీహార్‌లోని బంకీపూర్, గుజరాత్‌లోని మంజల్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన కీలకమైన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. జూలై 30న జరిగిన పోలింగ్‌లో దతియాలో 71.42 శాతం, బంకీపూర్, మంజల్‌పూర్ నియోజకవర్గాల్లో మాత్రం వరుసగా 34.31 శాతం, 37.50 శాతం ఓటింగ్ నమోదైంది.

బంకీపూర్ (బిహార్) అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక బరిలో నిలిచిన జన్ సురాజ్ పార్టీ అధినేత, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ప్రస్తుతం ముందంజలో ఉన్నారు. నేడు కౌంటింగ్ మొదలైనప్పటి నుంచీ బీజేపీ నేత నీరజ్‌ కుమార్‌ కంటే ముందంజలో ఉన్న ప్రశాంత్ కిశోర్ ఒక్కో రౌండ్ ముగిసేసరికి తన ఆధిక్యాన్ని అంతకంతకూ పెంచుకుంటున్నారు. ప్రస్తుతం 20 రౌండ్లు ముగిసేసరికి సమీప బీజేపీ ప్రత్యర్థితో పోలిస్తే 11,621 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ రాజీనామా చేయడంతో దతియా స్థానం ఖాళీ అయింది. బీజేపీ ఎమ్మెల్యే యోగేష్‌భాయ్ నరందాస్ పటేల్ మరణంతో మంజల్‌పూర్ స్థానం ఖాళీ అయింది. ఆయా స్థానాలకు ఉప ఎన్నికలు అనివార్యమైయ్యాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -