– బీహార్ ఎన్నికల ప్రచారంలో రిలీఫ్
పాట్నా: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీహార్‌లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే బెగుసరారు జిల్లాలో ఆయన మత్స్యకారులతో కలిసి చేపల వేట నిర్వహించారు. దీనికి సంబంధించిన దృశ్యాలను కాంగ్రెస్ పార్టీ ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేసింది.మాజీ మంత్రి, వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ వ్యవస్థాపకుడు, విపక్ష కూటమి డిప్యూటీ సీఎం అభ్యర్థి ముకేశ్ సాహ్నీతో కలిసి రాహుల్ గాంధీ బోటు సాయంతో ఓ చెరువులోకి వెళ్లారు. ఈ క్రమంలోనే చేపలు పట్టేందుకుగానూ ముకేశ్ సాహ్నీ నీళ్లలోకి దిగి వలవేశారు. కాసేపటికి రాహుల్ గాంధీ సైతం నీళ్లలో దూకారు. మత్స్యకారులతో కలిసి చేపలు పట్టారు. ఈత కొట్టారు.ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ జాలర్లతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నట్టు కాంగ్రెస్ తెలిపింది. వేట నిషేధిత కాలంలో మత్స్యకారుల కుటుంబాలకు రూ.5 వేల చొప్పున ఆర్థిక సాయం, బీమా సదుపాయం, చేపల మార్కెట్‌ల ఏర్పాటు, మత్స్య సంపద కోసం జలవనరుల పునరుద్ధరణ వంటి హామీలు ఇచ్చినట్టు వెల్లడించింది.
చెరువులోకి దిగి.. రాహుల్ చేపల వేట
- Advertisement -
- Advertisement -



