నవతెలంగాణ – షాద్ నగర్ రూరల్
చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్దఈ రోజు తెల్లవారుజామున జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంపై షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్ – బీజాపూర్ నేషనల్ హైవేపై తాండూరు డిపో కు చెందిన ఆర్టీసీ బస్సును చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద కంకర లోడ్‌తో వస్తున్న టిప్పర్ ఢీ వేగంగా కొట్టింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందడం పలువురికి తీవ్ర గాయాలపాలవ్వడం పట్ల విచారం వ్యక్తం చేశారు. నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగా అమాయక ప్రజల ప్రాణాలు కోల్పోయారు అని ఆవేదన వ్యక్తం చేశారు . ప్రభుత్వ పరంగా బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది అని వివరించారు. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
చేవెళ్ల మీర్జాగూడ బస్సు ప్రమాదంపై షాద్ నగర్ ఎమ్మెల్యే తీవ్ర దిగ్భ్రాంతి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



