హీరో దేవన్ హీరోగా, ఆయన స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న సూపర్ నేచురల్ లవ్ స్టోరీ ‘కృష్ణ లీల’. ‘తిరిగొచ్చిన కాలం’ అనేది ట్యాగ్ లైన్. ధన్య బాలకృష్ణన్ హీరోయిన్. బేబీ వైష్ణవి సమర్పణలో మహాసేన్ విజువల్స్ బ్యానర్ పై జ్యోత్స్న జి దీన్ని నిర్మించారు. ఈనెల 7న విడుదల కానున్న సందర్భంగా హీరో, డైరెక్టర్ దేవన్ సోమవారం మీడియాతో ముచ్చటించారు.
నేను సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూనే రెండు సినిమాల్లో మంచి పాత్రలు చేశాను. కొత్త క్యారెక్టర్స్ కోసం ఎదురు చూస్తున్నప్పుడు నిర్మాత జోష్న, రైటర్ అనిల్ ఈ కథ చెప్పారు. వారం రోజుల తర్వాత ఈ జనరేషన్‌కి ఈ కథని ఎలా చెప్పొచ్చో కొన్ని మార్పులు చేసి, ఓ కొత్త రకం స్క్రీన్ ప్లేతో చెప్పాను. అది వారికి చాలా నచ్చింది. నేనే డైరెక్ట్ చేస్తానని చెప్పడంతో వాళ్లు కూడా చాలా హ్యాపీగా ఫీలయ్యారు. నాకు దర్శకత్వంలో అనుభవం లేదు. కానీ కథ, స్క్రీన్ ప్లే మీద మంచి అవగాహన ఉంది. అదే నమ్మకంతో డిఓపి చోటా కె నాయుడు కలిశాను. ఆయన కథ విని, చాలా ఎగ్జైట్ అయ్యారు. ఎంతో ఎంకరేజ్ చేశారు.
లీల అంటే ఆట. కృష్ణుడు ఒక ప్రేమ కథని ఎలా ఆడారు?, ఎలా ఆడించారనేది ఈ సినమా. మనిషి కాలాన్ని వెనక్కి తిరిగి తీసుకురాలేడు. కానీ ఒక దైవత్వంతో కాలం మళ్ళీ తిరిగి వస్తే ఎలా ఉంటుంది అనేది చాలా ఆసక్తికరంగా చూపించాను. మన ప్రతి పనికి ఒక డెస్టినీ ఉంటుంది. మనం కలిసే ప్రతి వ్యక్తితో మనకు ఒక ఎటాచ్‌మెంట్ ఉంటుంది. ఈ జన్మలో నీతో ప్రయాణించే ప్రతి వ్యక్తి గత జన్మలో నీతో అనుబంధం కలిగి ఉంటారు. వాళ్లకి ప్రేమని పంచు అనేది భగవద్గీత చెప్తుంది. ఇందులో ఆ ఎలిమెంట్‌ని చాలా కొత్తగా చూపించాం. కృష్ణ తత్వం అనేది ఒక మహా సముద్రం. భగవద్గీతలో చెప్పే వాక్యాలు ఈ కథకి చాలా అద్భుతంగా కనెక్ట్ అయ్యాయి. నేను గంగాధర శాస్త్రి ప్రవచనాలు ఎక్కువగా వినేవాడి. ఆయనకి కథ చెప్పినప్పుడు, నాకున్న చాలా సందేహాల్ని ఆయన నివత్తి చేశారు. ఈ కథ విషయంలో హెల్ప్ చేశారు. ఇది కంటెంట్ పరంగా చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. 
మేము పేపర్ మీద ఎలా అనుకున్నామో తెరమీద అలా అద్భుతంగా చూపించాను. చాలా నిజాయితీ ఉన్న కథ ఇది. కథనే హీరోగా నమ్ముకున్నాను. ఈ కథ చెప్పినప్పుడు ధన్య బాలకృష్ణ అద్భుతంగా కనెక్ట్ అయ్యారు. ఆమె చాలా మంచి పెర్ఫార్మర్. పథ్వి, తులసి .. ఇలా చాలా మంచి ఉన్నారు. అందరూ కూడా చాలా అద్భుతమైన సపోర్ట్ ఇచ్చారు. ప్రేమ అనేది చాలా గొప్ప ఎమోషన్. భార్యాభర్తలు, తండ్రీ కొడుకులు, మనకి మన ఫ్రెండ్స్‌కి, మనకి జంతువులకు మధ్య ఉన్నది ఏదైనా కూడా ప్రేమే. ఈ సినిమా చూసిన తర్వాత మన ఫ్రెండ్, మనతో పరిచయమున్న వ్యక్తులు అందరి పట్ల మనకి ఉన్న ఓ గొప్ప అనుబంధాన్ని ఫీల్ అవుతాం. డిఓపి సతీష్ ముత్యాల కెమెరా పనితనం, భీమ్స్ ఇచ్చిన వండర్‌ఫుల్ మ్యూజిక్, ఆర్‌ఆర్ చాలా అద్భుతంగా వచ్చింది. విఎఫ్‌ఎక్స్ టీం కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు.
పవర్‌ఫుల్ కథే హీరో..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES

                                    

