Wednesday, November 5, 2025
E-PAPER
Homeజిల్లాలుజూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రులు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రులు

- Advertisement -
  • – మాట ఇచ్చినట్టే పనులు చేశాం..
  • -మంత్రులు శ్రీధర్ బాబు, లక్ష్మణ్ కుమార్..
  • నవతెలంగాణ – బంజారా హిల్స్
  • ప్రజా పాలన ప్రజల క్షేమం కోరుతోందనీ, మాట ఇచ్చినట్టే పనులు చేశామాని మంత్రులు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్లు తెలిపారు.
    • మంగళవారం శ్రీనగర్ కాలనీ లోని జీహెచ్ఎంసీ పార్క్ లో ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, స్థానిక కార్పొరేటర్ వనం సంగీత శ్రీనివాస్ యాదవ్ ముఖ్య నేతలతో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించారు.
    • హైదరాబాద్ మహా నగరాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, గత రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టులు,సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరించారు. రాబోయే రోజుల్లో నగరంలో మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతానికి అమలు చేయబోయే భవిష్యత్తు ప్రణాళికలను ఓటర్లకు వివరించారు.

అన్ని వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ఓటర్లకు వివరించారు. బీఆర్ఎస్, బీజేపీ మాటలు నమ్మి మోసపోవద్దని కోరారు. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించి… నిరంతరం జూబ్లీహిల్స్ ఓటర్లకు అందుబాటులో ఉండే నవీన్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -